AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్ 25 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!

Horoscope Today (April 25, 2026): ఈ రోజు గ్రహాల అనుకూలతతో చాలా రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తోంది. మేషం నుంచి మీనం వరకు అనేక రాశులకు ఆర్థిక వృద్ధి, శుభవార్తలు, అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తవుతాయి, కొన్ని రాశుల వారికి పెళ్లి, ఉద్యోగ, విదేశీ అవకాశాలు కలిసివస్తాయి.

ఏప్రిల్ 25 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, శుభవార్తల జోరు!
Rashifal In Telugu 25 April 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2026): మేష రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మిథున రాశి వారికి ఆర్థికంగా బాగా అభివృద్ధి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రవి, శుక్రుల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగంలో శక్తి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు ఫలిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో సమయం అనుకూలంగా ఉంది. జీతభత్యాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. పిల్లలలో ఒకరికి విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

శుక్ర, శని, గురువులు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ప్రేమలో పడే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

లాభ స్థానంలో రవి సంచారం వల్ల ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థికంగా బాగా అభివృద్ధి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. గురు సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు, వివాదాలు పరిష్కామవుతాయి. ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. ముఖ్య మైన వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి బాగా అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

లాభ స్థానంలో శుక్రుడు. దశమ స్థానంలో రవి సంచారం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. రాజ యోగాలు, ధన యోగాలు పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఉద్యోగ జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రాశ్యధిపతి రవికి భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితి, దశమంలో శుక్రుడు, లాభ స్థానంలో గురువు సంచా రం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఐ.టి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మిత్రులతో విందుల్లో పాల్గొంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడి కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గురు, కుజ, శని, రవులతో పాటు చంద్రుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మీకు ఈ రోజంతా తిరుగుండదు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. హోదా పెరగ డానికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల పరంగా పురోగమిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

రాశ్యధిపతి కుజుడితో పాటు, శుక్ర, రవి అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ముఖ్య మైన వ్యవహారాల్ని తేలికగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గురు, రాహు, రవి గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల అంచనాలకు మించిన ఆదాయ వృద్ధి ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాలు, పుణ్య కార్యాల మీద బాగా ఖర్చవుతుంది. వైద్యపరమైన ఖర్చులు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కుజ, బుధ, శని, శుక్రుల అనుకూలత వల్ల అన్ని రకాలు గానూ మీ ప్రాభవం పెరుగుతుంది. లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. ఆదాయానికి లోటుండదు. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయం. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమంలో గురువు ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది అవకాశముంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కుటుంబ వ్యవహారాల మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుజ, గురు, రవుల అనుకూల సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. తండ్రి వైపు నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహిం చని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us