AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srihari: శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.! ఆయన గురించి చిరంజీవి ఏమన్నారంటే.. డిస్కో శాంతి

మగధీర సినిమాలో షేర్ ఖాన్ పాత్రను శ్రీహరి కాకుండా మరెవరైనా చేయగలరా? ఆ పాత్ర వెనుక ఉన్న అసలు కథ, మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్, రామ్ చరణ్‌కు శ్రీహరి ఇచ్చిన కఠినమైన జిమ్ ట్రైనింగ్ గురించి డిస్కో శాంతి పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Srihari: శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.! ఆయన గురించి చిరంజీవి ఏమన్నారంటే.. డిస్కో శాంతి
Disco Shanthi
Ravi Kiran
|

Updated on: Apr 24, 2026 | 9:52 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘రియల్ స్టార్’ శ్రీహరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన పోషించిన ఎన్నో పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయినా, ‘మగధీర’లోని షేర్ ఖాన్ పాత్ర మాత్రం ఎప్పటికీ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన భార్య డిస్కో శాంతి ఆ సినిమా వెనుక ఉన్న అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మొదట్లో శ్రీహరి హీరోగా బిజీగా ఉండటం వల్ల, సపోర్టింగ్ రోల్ చేయడం ఇష్టం లేక శాంతి వద్దని చెప్పారట. కానీ రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో శ్రీహరి ఆ పాత్రను ఒప్పుకున్నారు.

ఇది చదవండి: అప్పుగా ఇచ్చిన వ్యక్తి తీర్చకుండా చనిపోతే.. ఇలా చేస్తే డబ్బు ఇంటికి ఈజీగా తిరిగి వస్తుంది

మెగాస్టార్ చిరంజీవి కూడా ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడుతూ, షేర్ ఖాన్ పాత్రను శ్రీహరి కాకుండా మరెవరూ మోయలేరని ప్రశంసించారు. నిజానికి రామ్ చరణ్‌కు, శ్రీహరికి మధ్య ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. చరణ్ తన బిడ్డ లాంటివాడని శ్రీహరి భావించేవారు. మగధీర సినిమా కోసం చరణ్‌ను సిద్ధం చేసే బాధ్యతను చిరంజీవి శ్రీహరికే అప్పగించారు. చరణ్ కొన్ని రోజుల పాటు శ్రీహరి ఇంటికే వచ్చి జిమ్ ట్రైనింగ్ తీసుకునేవారట. శ్రీహరి తన వర్కవుట్స్ విషయంలో ఎంత కఠినంగా ఉండేవారో, చరణ్‌ను కూడా అలాగే ట్రైన్ చేశారట.

శ్రీహరి గారు ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి పూజ చేసి, ఆ తర్వాత గంటల తరబడి భారీ వెయిట్స్ ఎత్తుతూ ఎక్సర్సైజ్ చేసేవారట. చరణ్ ఆ ట్రైనింగ్ తట్టుకోలేక కొన్ని రోజుల తర్వాత వెళ్ళలేకపోయారని శాంతి నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. మగధీర సినిమాలో భైరవ చనిపోయినప్పుడు శ్రీహరి చెప్పే “మళ్ళీ పుడతావురా భైరవ” అనే డైలాగ్ ఇప్పటికీ తనకు ఎంతో ఇష్టమని, ఆ సీన్ వచ్చినప్పుడు ఎన్ని పనులున్నా వదిలేసి వచ్చి చూస్తానని ఆమె ఆవేదనతో పంచుకున్నారు. శ్రీహరి క్రమశిక్షణ, నటన పట్ల ఆయనకున్న అంకితభావమే నేటికీ ఆయనను మనందరి గుండెల్లో సజీవంగా ఉంచాయి.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఎలా రాయాలి.? ఎన్ని రూపాయల వరకు రాయొచ్చు..

Follow Us