Tollywood: రజినీకాంత్, షారుఖ్ ఖాన్లకు నో చెప్పింది.. యాంకర్‌గానే క్రేజ్.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరంటే..
బుల్లితెరపై మోస్ట్ పాపులర్ యాంకర్. కామెడీ పంచులు, వాక్చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆమెను తన సినిమాల్లో నటించాలని ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రెండుసార్లు అడగ్గా.. సున్నితంగా తిరస్కరించింది. చివరకు బాలీవుడ్ బాద్ షా రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చినా కాదనుకుని యాంకర్ గానే కంటిన్యూ అయ్యింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ తన సినిమాలో నటించాలని ఓ యాంకర్ ను అడగ్గా.. సున్నితంగా తిరస్కరించింది. అలాగే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ చేయకుండానే బుల్లితెరపై హోస్ట్ గానే పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఈ విషయాన్ని ఎడిటర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె మరెవరో కాదు, 90లలో ప్రముఖ టీవీ ప్రెజెంటర్ అయిన పెప్సి ఉమా. తమిళంలో ఆమె చాలా పాపులర్. ‘పెప్సీ యువర్ ఛాయిస్’ కార్యక్రమంతో చాలా పాపులర్ అయ్యింది. ఈ షో అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ షో ద్వారా ఆమెకు స్టార్ హీరోహీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ కాలంలో, పెప్సి ఉమా ఒక సినిమా హీరోయిన్‌తో సమానమైన పేరు. అంత ప్రజాదరణ పొందినప్పటికీ ఆమె ఎప్పుడూ సినిమాల్లోకి అడుగుపెట్టలేదు.
తనకు సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ నటించడానికి నిరాకరించిందని సమాచారం. పెప్సి ఉమే స్వయంగా ఒక పాత ఇంటర్వ్యూలో సినిమాల్లో నటించకపోవడం గురించి మాట్లాడింది. పెద్ద దర్శకులు, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె నటించేందుకు నిరాకరించందట. ఎందుకంటే అప్పట్లో తనకు నటనపై అంతగా ఆశక్తి లేదని తెలిపింది. ఉమ తాను పనిచేసిన ఏ రంగంలోనైనా అభిరుచి, ఉత్సాహంతో పనిచేయాలని నిశ్చయించుకుంది. తనకు ఆసక్తి లేకపోవడం వల్ల నటనను కొనసాగించలేదని చెప్పుకోచ్చింది.
రజనీకాంత్ తనను ఆహ్వానించినప్పుడు కూడా తాను నటించడానికి నిరాకరించానని ఉమా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కె.ఎస్. దర్శకత్వం వహించిన హిట్ చిత్రం ‘ముత్తు’లో నటించమని పెప్సి ఉమాను రజనీకాంత్ స్వయంగా ఆహ్వానించారు. కానీ ఆమె నటించేందుకు ఒప్పుకోలేదు. మరో సినిమాలో నటించమని రజనీకాంత్ ఇచ్చిన ఆహ్వానానికి పెప్సి ఉమా కూడా నో చెప్పింది. అదొక్కటే కాదు. కోలీవుడ్ ని దాటి హిందీలో షారుఖ్ ఖాన్ సరసన నటించే ఆఫర్ ని కూడా పెప్సీ ఉమా తిరస్కరించింది. సచిన్ టెండూల్కర్ తో కలిసి ఎలాంటి ప్రకటనలోనూ నటించడానికి నిరాకరించింది. ఉమ సినిమాల్లోకి వెళ్లకుండానే టీవీ వ్యాఖ్యాతగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :




