Manchu Manoj: మంచువారింట అంతులేని కథ.. అన్నదమ్ముల మధ్య నాన్‌స్టాప్ రచ్చ..
మళ్లీ మొదలైన మంచు మంటలు. జల్‌పల్లిల్లిలోని మోహన్‌బాబు ఫాంహౌస్‌కు వెళ్లారు మనోజ్. గేట్లు తీయకపోవటంతో బయటే బైఠాయించి నిరసన. తన కార్లతో పాటు, వ్యక్తిగత సామాన్లు దొంగిలించారంటూ నార్సింగ్ పీఎస్‌లో నిన్న మనోజ్ ఫిర్యాదు. విష్ణు మనుషుల పనేనంటూ మనోజ్ ఆరోపించారు. ఇవాళ విష్ణు రియాక్షన్స్ వస్తే.. అన్నీ కలిపి. మరో వైపు ఇలాగే కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఇలాగే ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తామని మనోజ్ కి పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

మంచు ఫ్యామిలీ కథాచిత్రం ఇంకా ఎన్ని సిరీస్‌లు నడుస్తుందో తెలీదు. తండ్రితో పాటు అన్నపై మనోజ్ ఫైట్‌కి ఎండ్‌కార్డ్ ఎప్పుడో ఎవరికీ అర్ధంకావడం లేదు. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా తెగడమే లేదు మంచు ఫ్యామిలీ పంచాయితీ. కోర్టుల్లోనూ తేలని కాంట్రవర్సీగా మారిపోయింది ఫ్యామిలీ మ్యాటర్. కార్లు ఎత్తుకెళ్లారంటూ సీసీ ఫుటేజ్‌లతో పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచు మనోజ్.. మరోసారి జల్‌పల్లి ఇంటిదగ్గర ప్రత్యక్షమయ్యారు. జల్‌పల్లిలోని నివాసం దగ్గరికి చేరుకున్న మంచు మనోజ్‌ని లోపలికి అనుమతించలేదు. గేట్లు తీయకపోవటంతో నేలపైనే కూర్చుని నిరసనకు దిగారు మోహన్‌బాబు చిన్నకుమారుడు.
ఇప్పటికే మంచు ఇంటి పంచాయితీపై నానారచ్చా జరగటంతో ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు పోలీసులు. మోహన్‌బాబు ఇంటికి కిలోమీటరు దూరంలో 100మంది పోలీసులతో చెక్ పోస్ట్ పెట్టేశారు. ఇంటి పరిసరాల్లో ఆంక్షలు విధించి బయటివారెవరినీ లోపలికి అనుమతించలేదు. మనోజ్ కూడా గేటు బయటే అడ్డుకున్నారు పోలీసులు. నేనేంటీ నే చేసిన తప్పేంటీ అని ప్రశ్నిస్తున్నాడు మంచు మనోజ్. ఆస్తులొద్దూ ఏమొద్దన్నా ఎందుకిలా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆవేదనకు గురవుతున్నాడు. అంతా అన్నే చేస్తున్నాడని విష్ణువైపు వేలెత్తి చూపిస్తున్నాడు.
మంచు మోహన్‌బాబు కుటుంబంలో ఐదారునెలలుగా విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే తండ్రిపై, అన్నపై పలుమార్లు పోలీసులకు మనోజ్ ఫిర్యాదులు చేశారు. రోడ్డుకెక్కి న్యూసెన్సులు క్రియేట్ చేయొద్దని పోలీసులు మంచు ఫ్యామిలీలో రెండువర్గాలకు వార్నింగ్‌లు కూడా ఇచ్చారు. దీంతో ఫ్యామిలీలో విభేదాలు సర్దుకున్నాయనేలోపే మంచు విష్ణుపై మరోసారి ఫైరయ్యారు మనోజ్. ఇంట్లోనో, గేటు దగ్గరో కాదు.. థియేటర్‌లో తేల్చుకుందాం నీ పెతాపమో నా పెతాపమో అనేదాకా వెళ్లాడు మంచువారబ్బాయ్. న్యాయస్థానాన్ని, కోర్టు ఆదేశాలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారనేది మంచు మనోజ్ లేటెస్ట్ ఎలిగేషన్. పోలీసులు కూడా ఏం జరుగుతోందో గమనించి తనకు న్యాయం చేయాలని మనోజ్ రిక్వెస్ట్ చేయడం ఆసక్తిరేపుతోంది. మనోజ్ ఫిర్యాదుతో మంచు ఫ్యామిలీలో వివాదాలు సమ్మర్‌హీట్‌ని మించి సెగలు రేపుతున్నాయి. కార్లు ఎత్తుకెళ్లారన్న మనోజ్ ఆరోపణలపై విష్ణు రియాక్షనేంటో, గేటుముందు కొడుకు బైఠాయింపుపై డైలాగ్‌కింగ్ నెక్ట్స్ డైలాగేంటో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి :




