Tollywood: ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలలో అలరించే చిత్రాలు ఇవే.. నవంబర్ మొదటి వారం ఆన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..

అటు థియేటర్లలోనే కాకుండా.. ఇటు ఓటీటీలలోనూ సినీ ప్రియులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మరీ ఈ వారం బాక్సాపీస్ వద్ద.. డిజిటల్ ప్లాట్ ఫాంలో సందడి చేయనున్న సినిమాలు ఎంటో తెలుసుకుందామా.

Tollywood: ఈ వారం థియేటర్లలో.. ఓటీటీలలో అలరించే చిత్రాలు ఇవే.. నవంబర్ మొదటి వారం ఆన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..
Tollywood
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 31, 2022 | 11:26 AM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం కాంతార ప్రభంజనం కొనసాగుతుంది. కేరళ ఆదివాసీల భూతకోల సంస్కృతి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇక గత వారం థియేటర్లలో చిన్న సినిమాలు సత్తా చాటాయి. అలాగే నవంబర్ మొదటి వారం కూడా పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అటు థియేటర్లలోనే కాకుండా.. ఇటు ఓటీటీలలోనూ సినీ ప్రియులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మరీ ఈ వారం బాక్సాపీస్ వద్ద.. డిజిటల్ ప్లాట్ ఫాంలో సందడి చేయనున్న సినిమాలు ఎంటో తెలుసుకుందామా.

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రై బ్..

యంగ్ హీరో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్. డైరక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి కీలకపాత్రలలో నటించిగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

ఊర్వశివో.. రాక్షసివో.

డైరెక్టర్ రాకేశ్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది.

బొమ్మ బ్లాక్ బస్టర్..

నందు, రష్మి జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రాజ్ విరాట్ దర్శకత్వం అందించగా.. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.

అలాగే.. చక్కటి మిస్టీరియస్ లవ్ స్టోరీ, తగ్గేదే లే, జెట్టి, మిలి, చిత్రాలు నవంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు..

హాట్ స్టార్.. బ్రహ్మాస్త్ర.. నవంబర్ 4

అమెజాన్ ప్రైమ్.. పొన్నియిన్ సెల్వన్.. నవంబర్ 4 మై పోలీస్ మ్యాన్.. నవంబర్ 4

నెట్ ఫ్లిక్స్.. ది ఘోస్ట్.. నవంబర్ 4 ఇన్ సైడ్ మ్యాన్.. అక్టోబర్ 31 కిల్లర్ సాలీ..నవంబర్ 4 ఎనోలా హోల్మెస్ 2.. నవంబర్ 4 మేనిఫెస్ట్ సీజన్ 4.. నవంబర్ 4 లుకిసిమ్.. నవంబర్ 4 దావిద్.. నవంబర్ 4 బుల్లెట్ ట్రైన్.. నవంబర్ 5

ఆహా.. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్ 3.. నవంబర్ 4 పెట్టకాలి.. నవంబర్ 4

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!