AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆదిపురుష్ రిలీజ్ వాయిదా తప్పదా ?..

రామయణం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో కృతి సనన్ సీతగా... సైప్ అలీ ఖాన్ రావణడిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Prabhas: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆదిపురుష్ రిలీజ్ వాయిదా తప్పదా ?..
Adipurush
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2022 | 8:34 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమా కూడా డార్లింగ్ ఫ్యాన్స్‏ను మెప్పించలేకపోయింది. ఇక ప్రభాస్ చేస్తున్న తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ కె సినిమాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమైన ఆదిపురుష్ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. రామయణం ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో కృతి సనన్ సీతగా… సైప్ అలీ ఖాన్ రావణడిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈసినిమా సంక్రాంతి రేసు నుంచి ఔట్ అయ్యి.. వేసవికి వాయిదా పడిందట. జనవరి 12న బడా హీరోల చిత్రాలతో పాటు.. ఒకేసారి అనేక సినిమాలు విడుదలవుతున్న క్రమంలో ఆదిపురుష్ చిత్రాన్ని వాయిదా వేయాలని భావిస్తున్నారట మేకర్స్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట. ఇక ఇదే జరిగితే మరోసారి డార్లింగ్ అభిమానులకు నిరాశ తప్పదు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రాన్ని 3డి ఫార్మాట్ లో బిగ్ స్క్రీన్ పై ప్రదర్శించనున్నారు. ఇక ఈ సినిమా కాకుండా ప్రస్తుతం డార్లింగ్ నటిస్తోన్న సలార్ చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో శ్రుతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటిలో శరవేగంగా జరుగుతుంది.

Follow Us
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్
బీసీసీఐకి వందేళ్లు.. భారత్ vs వరల్డ్ ఎలెవన్ మెగా మ్యాచ్‌కు ప్లాన్
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ప్రోటీన్ రెండింటిలోనూ ఒకటేనా?
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ప్రోటీన్ రెండింటిలోనూ ఒకటేనా?
బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..
బంగాళాఖాతంలో కల్లోలం.. ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు..
చికెన్‌తో ఈ బెంగాలీ స్టైల్ వంటకం చేశారంటే.. రుచి మర్చిపోలేరు!
చికెన్‌తో ఈ బెంగాలీ స్టైల్ వంటకం చేశారంటే.. రుచి మర్చిపోలేరు!
ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త.. స్థానికులకు మరో ఛాన్స్!
ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త.. స్థానికులకు మరో ఛాన్స్!
అయ్యయ్యో.. గుత్తివంకాయ కర్రీ చేయడం ఇంత ఈజీనా?ఇన్ని రోజులు తెలియలే
అయ్యయ్యో.. గుత్తివంకాయ కర్రీ చేయడం ఇంత ఈజీనా?ఇన్ని రోజులు తెలియలే
జపాన్‌లో ఐఫోన్ 16 ప్రో పోగొట్టుకున్న భారతీయ మహిళ షాక్
జపాన్‌లో ఐఫోన్ 16 ప్రో పోగొట్టుకున్న భారతీయ మహిళ షాక్
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం
భారత్-జపాన్ చారిత్రక పోరు లైవ్ ఎక్కడ చూడాలంటే?
భారత్-జపాన్ చారిత్రక పోరు లైవ్ ఎక్కడ చూడాలంటే?
పొప్పడి పండు చెట్టు ఇంట్లో పెంచితే ఏమవుతుందో తెలుసా?
పొప్పడి పండు చెట్టు ఇంట్లో పెంచితే ఏమవుతుందో తెలుసా?