AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిట్ కొట్టాలంటే డైరెక్టర్‌ను రిపీట్ చేయడమే బెస్ట్ అంటున్న స్టార్ హీరోలు..

ఒక సినిమా రిలీజ్‌ కాకముందే సేమ్‌ కాంబోతో ఇంకో సినిమాను ప్రకటించడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. తొలి సినిమా ఫైనల్ రిజల్ట్‌ క్లియర్‌గా తెలీకుండానే సేమ్ కెప్టెన్సీలో పని చేయాలని ఆ హీరోలకు ఎందుకనిపిస్తున్నట్టు..

హిట్ కొట్టాలంటే డైరెక్టర్‌ను రిపీట్ చేయడమే బెస్ట్ అంటున్న స్టార్ హీరోలు..
Vijay Devarakonda, Ajith
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2022 | 8:16 PM

Share

ఒక సినిమా రిలీజ్‌ కాకముందే సేమ్‌ కాంబోతో ఇంకో సినిమాను ప్రకటించడం ఈ మధ్య ట్రెండ్‌గా మారింది. తొలి సినిమా ఫైనల్ రిజల్ట్‌ క్లియర్‌గా తెలీకుండానే సేమ్ కెప్టెన్సీలో పని చేయాలని ఆ హీరోలకు ఎందుకనిపిస్తున్నట్టు.. ఆ డైరెక్టర్ల మీద అంత కాన్ఫిడెన్స్ ఎందుకు కలుగుతున్నట్టు.. అసలు విషయం ఏంటంటే.. వలిమై సినిమాను ఫక్తు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలిచి, ఫస్ట్‌ టైమ్ అజిత్‌కి మల్టిలింగువల్ సక్సెస్‌నిచ్చారు డైరెక్టర్ హెచ్ వినోద్. అజిత్‌కి బైక్ రేసింగ్ మీద వుండే మక్కువను స్క్రీన్ మీద పోట్రే చేస్తూ.. హాలీవుడ్ స్థాయిని గుర్తుచేసేంతటి గొప్ప ఫీట్స్‌తో భీకమరైన స్టంట్స్ చేయించారు. అలా ఫిదా అయ్యారు కనుకే లెటజ్ డూ ఎగెయిన్‌ అంటూ వినోద్‌కే మళ్లీ కాల్షీట్స్ ఇచ్చారు కోలీవుడ్‌ తల.

వినోద్ కెప్టెన్సీలో బోనీకపూర్ నిర్మిస్తున్న ఏకే61.. అజిత్‌ న్యూలుక్‌తోనే వీర లెవల్లో వైరల్ అవుతోంది. ప్రాజెక్ట్‌ మీద అంచనాల్ని పెంచేస్తోంది. సరిగ్గా ఇటువంటి కనెక్టివిటీనే టాలీవుడ్‌లో మరో కాంబినేషన్‌ దగ్గర చూస్తున్నాం. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌.. రౌడీ హీరోని టేకప్ చేసి లైగర్‌స్టార్‌గా ఇప్పటికే విజయ్‌ దేవరకొండకు పాన్ ఇండియా ఇమేజ్ ఇచ్చేశారు. హోల్ ఇండియా వెయిటింగ్ ఫర్ లైగర్ అంటే ఆశ్చర్యం లేదిప్పుడు. లైగర్ మూవీ రిలీజ్ కాకముందే.. రిపీట్‌ కొడదాం రండి బాసూ అంటూ పోకిరీ డైరెక్టర్‌కి సైగ చేశారు విజయ్‌ దేవరకొండ. పూరి క్యాంప్‌లో కంటిన్యూ కాబోతున్న అర్జున్‌రెడ్డి.. అనే ఊసు ఇప్పుడు న్యూస్‌గా మారింది. పూరి జగన్నాథ్ మానసపుత్రికగా ఎప్పటినుంచో ప్రచారంలో వున్న జనగనమణ ప్రాజెక్ట్‌కు రీసెంట్ గా అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆడియన్స్‌ ముందుకు వెళ్లకముందే.. మరో సినిమాను అనౌన్స్‌ చేయడం అనే ట్రెండ్.. ఈ క్రేజీ కాంబినేషన్లను మరింత క్రేజీగా మార్చేస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Deepthi Sunaina: బుట్టబొమ్మ అందాలతో అలరింప చేస్తున్న దీప్తి సునైనా లేటెస్ట్ ఫోటోస్

Tiger Nageshwar Rao: టైగర్ నాగేశ్వరరావులో ఒక్కరు కాదు ఇద్దరు ముద్దుగుమ్మలు.. ఎవరెవరంటే..

Paruchuri: అన్నయ్య అలా మారడానికి అదే కారణం.. వైరల్‌ ఫోటోపై స్పందించిన పరుచూరి గోపాల కృష్ణా..