‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘రాధేశ్యామ్’ వరకు.. ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాలు ఇవే.. ప్రేక్షకులకు పండగే..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 29, 2021 | 10:09 PM

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా భాషతో సంబంధం లేకుండా..

'ఆర్ఆర్ఆర్' నుంచి 'రాధేశ్యామ్' వరకు.. ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాలు ఇవే.. ప్రేక్షకులకు పండగే..
Big Budget Movies

ప్రస్తుతం సినీ పరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా భాషతో సంబంధం లేకుండా.. పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అందుకునేందుకు స్టార్ హీరోలతోపాటు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాహుబలి సినిమాతో ప్రభాస్, రానా, డైరెక్టర్ రాజమౌళి దేశవ్యాప్తంగా స్టార్ డమ్‏ సంపాదించుకున్నారు. అటు కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో రాక్ స్టార్ యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవల్లో పాగా వేశారు. అయితే ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలలో దాదాపు అన్ని భారీ బడ్జెట్‏తో.. ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే బడ్జెట్, ప్రెజెంటేషన్ విషయానికి వస్తే.. అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయేలా భారతీయ సినిమాకు కొత్త తరంగాన్ని తెచ్చిపెడుతున్నారు. మరి ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలెంటో తెలుసుకుందామా.

నాగ్ అశ్విన్.. ప్రభాస్.. మహానటి వంటి సూపర్ హిట్ సినిమా అందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. తన తదుపరి చిత్రం పాన్ స్టార్ ప్రభాస్‏తో చేయబోతున్నట్లుగా గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ లెవ‏ల్లో కాకుండా.. వరల్డ్ వైడ్‏గా రూపొందించబోతున్నట్లుగా ప్రకటించడంతో అంచనాలు భారీగానే పెరిగాయి. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దీపికా పదుకునే, ప్రభాస్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

రాజమౌళి ఆర్ఆర్ఆర్.. దర్శక ధీరుడు రాజమౌళి.. తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది.

ఓంరౌత్ ఆదిపురుష్.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్… ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఇందులో మరో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తుండగా.. ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది.

రాధా కృష్ణ కుమార్.. రాధేశ్యామ్.. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా… డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా రాధే శ్యామ్. దాదాపు మూడేళ్లుగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

బ్రహ్మస్త్రా.. పార్ట్ 1 అలియాభట్, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం బ్రహ్మస్త్రా. యాక్షన్ అడ్వైంచర్‏గా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు.

పుష్ప.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మంధన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

సలార్.. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. ఇటివలే.. ప్రభాస్ హీరోగా సలార్ మూవీని ప్రారంభించాడు. ఇందులో శ్రుతి హసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read: Sumanth : రెండో పెళ్లిపై ట్విస్ట్ ఇచ్చిన హీరో సుమంత్.. ఆ శుభలేఖ..

Sarkaru Vaari Paata: మహేశ్ అభిమానులకు గుడ్‏న్యూస్.. ‘సర్కారు వారి పాట’ అప్‏డేట్ ఇచ్చిన మేకర్స్.. ఫస్ట్‏లుక్ ఎప్పుడంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu