MAA Elections: ముగిసిన ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్.. ఎన్నికల తేదీ ప్రకటించేది అప్పుడే.!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పై సర్వత్రా చర్చ జరుగుతుంది. తాజాగా 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. టాలీవుడ్ సీనియర్...

MAA Elections: ముగిసిన 'మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్.. ఎన్నికల తేదీ ప్రకటించేది అప్పుడే.!
Maa
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 29, 2021 | 9:31 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పై సర్వత్రా చర్చ జరుగుతుంది. తాజాగా ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. టాలీవుడ్ సీనియర్ నటులైన కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీ మోహన్, శివకృష్ణల అధ్వర్యంలో జరిగిన ఈ వర్చువల్ సమావేశం సుదీర్ఘంగా రెండు గంటల పాటు సాగింది. కమిటీ సభ్యులు పలు కీలక విషయాలపై చర్చించారు.

మా ఎన్నికల నిర్వహణ, జనరల్ బాడీ మీటింగ్ డేట్ ఎనౌన్స్‌మెంట్, జామా లెక్కలుపై అధ్యక్షుడు నరేష్, కార్యదర్శి జీవితలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆగష్టు 22న జరగబోయే సర్వసభ్య సమావేశంలో ఎన్నికల తేదీని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 12న ‘మా’ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహ రావు, జీవిత రాజశేఖర్ పోటి చేస్తున్నట్లు ప్రకటించడంతో మా ఎన్నికలు పూర్తిగా రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి.