AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumanth : రెండో పెళ్లిపై ట్విస్ట్ ఇచ్చిన హీరో సుమంత్.. ఆ శుభలేఖ..

హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి.

Sumanth : రెండో పెళ్లిపై ట్విస్ట్ ఇచ్చిన హీరో సుమంత్.. ఆ శుభలేఖ..
Sumanth
Rajitha Chanti
|

Updated on: Jul 29, 2021 | 9:27 PM

Share

హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని.. ఈ ఇద్దరూ కలిసి శుభలేఖలు కూడా పంచుతున్నారని ప్రచారం జరిగింది. అటు పలువురు సినీ ప్రముఖులు కూడా సుమంత్ రెండో పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే తన రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై హీరో సుమంత్ స్పందించారు.. తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని స్పష్టం చేశారు. తాను మరోసారి పెళ్లిచేసుకుంటున్నట్లుగా వస్తున్న వార్తలలో నిజం లేదని చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు సుమంత్.

ఆ వీడియోలో సుమంత్ మాట్లాడుతూ.. ఈ మధ్య నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని వార్తలు వస్తున్నాయి. కానీ నేను నిజ జీవితంలో పెళ్లి చేసుకోవడం లేదు. విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాంటి కథతో ఓ సినిమా రావడం తెలుగులో ఇదే మొదటిసారి. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఓ వెడ్డింగ్ కార్డ్ బయటకు వచ్చింది. దీంతో అందరూ అపార్థం చేసుకున్నారు అంటూ వివరణ ఇచ్చారు. అయితే సుమంత్ వీడియో ట్వీట్ చేస్తూ.. తన పెళ్లిపై స్పందించిన ఆర్జీవిని సైతం ట్యాగ్ చేశారు.

ట్వీట్..

సుమంత్ గతంలో తొలిప్రేమ ఫేమ్ కీర్తి రెడ్డితో వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. సుమంత్ మొదటిగా ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమా ద్వారానే సినీ కెరీర్ ప్రారంభించారు. ఇక ఆ తర్వాత సుమంత్ సరైన హిట్ అందుకోలేకపోయాడు. దీంతో నెమ్మది నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యాడు. ఇటీవల కపటదారి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్‏తు మరోసారి నిరాశే ఎదురయ్యింది. ప్రస్తుతం సుమంత్.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు.

Also Read: Sarkaru Vaari Paata: మహేశ్ అభిమానులకు గుడ్‏న్యూస్.. ‘సర్కారు వారి పాట’ అప్‏డేట్ ఇచ్చిన మేకర్స్.. ఫస్ట్‏లుక్ ఎప్పుడంటే..

సోషల్ మీడియాలో మరో రచ్చ.. ఒకరి తర్వాత ఒకరు.. ఆఖరికి సామ్‏ను కూడా లాగరుగా.. ఇంతకీ ఆ ట్వీట్స్‏కు అర్థమేంటో..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే