సోషల్ మీడియాలో మరో రచ్చ.. ఒకరి తర్వాత ఒకరు.. ఆఖరికి సామ్‏ను కూడా లాగరుగా.. ఇంతకీ ఆ ట్వీట్స్‏కు అర్థమేంటో..

సోషల్ మీడియాలో ఉపయోగించుకోవడంలో తారలను మించిన వారెవరు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల బాలీవుడ్ నుంచి టాలీవుడ్,

సోషల్ మీడియాలో మరో రచ్చ.. ఒకరి తర్వాత ఒకరు.. ఆఖరికి సామ్‏ను కూడా లాగరుగా.. ఇంతకీ ఆ ట్వీట్స్‏కు అర్థమేంటో..
Vijay Devarakonda

సోషల్ మీడియాలో ఉపయోగించుకోవడంలో తారలను మించిన వారెవరు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కాస్త సమయం దొరికితే చాలు నెట్టింట్లో గడిపేస్తున్నారు. లైవ్ చాట్స్‏లో అభిమానుల సందేహాలకు సమాధానాలిస్తూనే.. మరోవైపు.. వ్యక్తిగత విషయాలను, సినిమా అప్‏డేట్స్ ఇచ్చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీశారు బాలీవుడ్ స్టార్స్ హృతిక్, కియారా. వీరిద్దరూ చేసిన ట్వీట్స్ బాలీవుడ్‏లో పలు సందేహాలకు తావిస్తుండగా.. అందులోకి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను కూడా ట్వీట్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే విషయం ఏంటనేది రివీల్ చేయకుండా ఒకరినొకరు ట్యాగ్ చేసుకుంటూ సరికొత్త చర్చకు దారితీశారు.

అసలు విషయమేంటంటే.. గురువారం సాయంత్రం తన సింగిల్ ఫోటోను షేర్ చేసిన హృతిక్‌… ఇది ఓకేనా అంటూ కియారాను ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ మీద షార్ట్ గ్యాప్‌లో రియాక్ట్ అయిన కియారా… సరిపోదు అంటూ హృతిక్‌ ఫోటోకు తన పిక్‌ను యాడ్ చేసి ఇది బెటర్ అనుకుంటా! అంటూ తన ట్విటర్ పేజ్‌లో షేర్‌ చేశారు. అక్కడి ఆగితే పెద్ద న్యూసేం కాదు. ఈ పిక్‌ గురించి నువ్వేం అనుకుంటున్నావ్‌ అంటూ విజయ్‌ దేవరకొండకు ట్యాగ్ చేయటం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటి వరకు ఈ ముగ్గురు స్టార్స్‌ ఎవరితో ఎవరూ కలిసి వర్క్ చేయలేదు. సో.. ఈ కాంబినేషన్‌లో కొత్త సినిమా ఏదైనా వస్తుందా…? అన్న డిస్కషన్‌ మొదలైంది. అయితే అఫీషియల్‌గా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో అలాంటి హింట్స్ ఏం లేకపోవటంతో ఇది బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు సంబంధించిన అప్‌డేట్ అయ్యుంటుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే.. కియారా ట్వీట్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ..బాగుందికానీ..కాస్త రౌడీనెస్ తగ్గిందంటూ కామెంట్ చేశారు. దీనిపై స్పందించాలంటూ సమంతకు ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ గోలపై నెటిజన్లు తమదైన శైలీలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్.. రష్మికను ట్యాగ్ చేయకుండా.. సమంతను ట్యాగ్ చేయడంతో ఈ నలుగురు కలయికలో ఏదైనా మల్టీస్టారర్ రాబోతుందా ? అదే సందేహాలు మరింత ఎక్కువయ్యాయి.. అయితే విజయ్ ట్వీట్ పై సమంత ఏమని స్పందిస్తుందో చూడాలి.

ట్వీట్..

ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఏడాదిన్నరగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో బాక్సర్‌గా కనిపించబోతున్నారు విజయ్‌. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… బాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించే రేంజ్‌లో విజయ్‌ని ప్రజెంట్ చేసేందుకు పర్ఫెక్ట్ ప్లాట్‌ఫామ్ సిద్ధం చేస్తున్నారు. అటు ఇటీవల విక్రమ్‌ వేదా రీమేక్‌ను ఎనౌన్స్‌ చేసిన హృతిక్‌… మరో యాక్షన్‌ మూవీలోనూ నటిస్తున్నారు. జగ్ జగ్‌ జియో , మిస్టర్‌ లెలె సినిమాల్లో నటిస్తున్నారు కియారా. మరి ఇంత బిజీగా ఉన్న ఈ స్టార్స్‌ ఏ విషయం గురించి ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే సమంత ట్వీట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సతీష్ రెడ్డి జడ్డా, TV9 Telugu, ET Desk..

Also Read: Jagapathi Babu: జగపతి బాబు సింప్లిసిటీ.. రోడ్డు పక్కన దాబాలో ప్రత్యక్షమైన హీరో.. ఫోటో వైరల్..

Ram Charan: యంగ్ టైగర్ ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానాలు.. చెర్రీ గెలుచుకున్న అమౌంట్ ఎంతంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu