Jagapathi Babu: జగపతి బాబు సింప్లిసిటీ.. రోడ్డు పక్కన దాబాలో ప్రత్యక్షమైన హీరో.. ఫోటో వైరల్..

జగపతి బాబు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జగ్గుభాయ్..

Jagapathi Babu: జగపతి బాబు సింప్లిసిటీ.. రోడ్డు పక్కన దాబాలో ప్రత్యక్షమైన హీరో.. ఫోటో వైరల్..
Jagapathi Babu

జగపతి బాబు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జగ్గుభాయ్.. ఇప్పుడు విలన్ పాత్రలలోనూ సత్తా చాటుతున్నారు. అప్పట్లో ముఖ్యంగా జగపతి బాబు.. మహిళ అభిమానులతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఆదరించేవారు. చాలా కాలం గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగ్గుభాయ్.. బాలయ్య లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో జగపతి బాబు అదరగొట్టారు. కేవలం హీరోగానే కాకుండా.. విలన్‏గానూ జగపతికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో జగ్గుభాయ్ హవానే. అటు సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ జగపతి బాబు హవా నడుస్తోంది. ఇటీవల కరోనాపై జాగ్రత్తలు.. వ్యాక్సిన్ గురించి చెప్పుకొస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు జగ్గుభాయ్.

అయితే ఎంత సంపాదించినా.. జగపతి బాబు సాధారణ వ్యక్తిగా జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. అలాగే తన దగ్గర పనిచేసేవాళ్లను కూడా ఎప్పుడూ చిన్నచూపు చూడరు. తాజాగా తన డ్రైవర్, అసిస్టెంట్‏తో కలిసి రోడ్డు పక్కన ఉన్న ఓ దాబాలో భోజనం చేశారు జగ్గుభాయ్. తన అస్టిస్టెంట్స్‏తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా రోజుల తరువాత ఇలా తిన్నామని జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఇక జగపతి బాబు ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. స్టార్ హీరో అయినా.. జగపతి ఎంతో సింప్లిసిటీని మెయింటైన్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జగపతి బాబు.. తమిళం, తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

ట్వీట్..

Also Read: Ram Charan: యంగ్ టైగర్ ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానాలు.. చెర్రీ గెలుచుకున్న అమౌంట్ ఎంతంటే..

Pawan Kalyan: పవన్ ముందే అమ్మాయికి వార్నింగ్ ఇచ్చిన రానా !.. పవర్ స్టార్ చూడండి ఏం చేశాడో..

 

Click on your DTH Provider to Add TV9 Telugu