Bhola Shankar: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. రీ స్టార్ట్ అయిన భోళాశంకర్ షూటింగ్

మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి మాస్ మాసాల పాత్రలో కనిపించి అలరించారు

Bhola Shankar: స్పీడ్ పెంచిన మెగాస్టార్.. రీ స్టార్ట్ అయిన భోళాశంకర్ షూటింగ్
Chiranjeevi
Follow us

|

Updated on: Jan 17, 2023 | 6:06 PM

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. బాబీ దర్శకత్వం వహించిన వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి మాస్ మాసాల పాత్రలో కనిపించి అలరించారు ఈ సినిమాలో.. చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ సినిమా ఈ సినిమా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా భోళాశంకర్. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ  మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇక “భోలా శంకర్” షూటింగ్ ఈ రోజు(జనవరి 17న) పునఃప్రారంభమైంది. మెగా బ్లాక్‌బస్టర్ ఫెస్టివల్ వైబ్‌ను కొనసాగిస్తూ హై పాజిటివ్ ఎనర్జీతో రామబ్రహ్మం సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని భారీ కోల్‌కతా సెట్‌లో ఈ రోజు ప్రారంభమైయింది.

వాల్తేరు వీరయ్యతో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో భోళా శంకర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెహర్ రమేష్, చిరంజీవిని స్టైలిష్, ఇంకా మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా కథానాయికగా కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.Bhola Shankar

Bhola Shankar