DilRaju: మూడు పాన్ ఇండియా చిత్రాలను అనౌన్స్ చేసిన దిల్ రాజు.. ఆ ముగ్గురు డైరెక్టర్స్ ఎవరంటే..

ఇక ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. వరుస పాన్ ఇండియా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా తాను చేయబోయే మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఇటీవల వరిసు ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొన్న దిల్ రాజు.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

DilRaju: మూడు పాన్ ఇండియా చిత్రాలను అనౌన్స్ చేసిన దిల్ రాజు.. ఆ ముగ్గురు డైరెక్టర్స్ ఎవరంటే..
Dil Raju
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 17, 2023 | 2:10 PM

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వారుసుడి సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ మూవీతో తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టారు దిల్ రాజు. తన బ్యానర్ నుంచి ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. ప్రతి ఏడాది వరుసగా సినిమాలను నిర్మిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇక ఇప్పుడు ఈ టాప్ ప్రొడ్యూసర్.. వరుస పాన్ ఇండియా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా తాను చేయబోయే మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఇటీవల వరిసు ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొన్న దిల్ రాజు.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ నిర్మించనున్నట్లు వెల్లడించారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇక తర్వాత హిట్ సినిమా దర్శకుడు శైలేష్ కొలనుతో.. సీనియర్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణలతో తన తదుపరి ప్రాజెక్ట్స్ ఉండబోతున్నట్లు తెలియజేశారు. ఈ మూడు పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారని.. భారీ వీఎఫ్ఎక్స్ తోపాటు.. భారీ స్థాయిలో లార్జర్ థన్ లైఫ్ క్యారెక్టర్స్ ను పరిచయం చేసేలా ఈ చిత్రాలు ఉండబోతున్నట్లు వెల్లడించారు. అలాగే…. ఈ చిత్రాల టైటిల్స్ కూడా అనౌన్స్ చేశారు. ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాకు రావణం అని టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తీసుకురాబోతున్నారు.

ఇవి కూడా చదవండి

కేజీఎఫ్ 3, ఎన్టీఆర్ సినిమాల అనంతరం ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా ప్రారంభం కానుంది. అలాగే శైలేష్ కొలనుతో తెరకెక్కించబోయే సినిమాకు విశ్వంభర అనే టైటిల్.. సీనియర్ డైరెక్టర్ ఇంద్రగంటి కలయికలో రాబోయే సినిమాకు జటాయు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాల్లో హీరోహీరోయిన్స్ ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. కానీ టైటిల్స్.. డైరెక్టర్లతోనే చిత్రాలపై అంచనాలను క్రియేట్ చేశారు దిల్ రాజు.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!