Kiran Abbavaram: ఆ క్రేజ్ ఏంటీ బాసూ.. గోదావరి జిల్లాలో కిరణ్ అబ్బవరంకు గ్రాండ్ వెల్‏కమ్.. చేతులు పట్టి లాగుతూ..

ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Kiran Abbavaram: ఆ క్రేజ్ ఏంటీ బాసూ.. గోదావరి జిల్లాలో కిరణ్ అబ్బవరంకు గ్రాండ్ వెల్‏కమ్.. చేతులు పట్టి లాగుతూ..
Kiran Abbavaram
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 17, 2023 | 8:49 AM

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మొదటి చిత్రం రాజావారు రాణిగారు సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన కిరణ్.. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ కిరణ్ ఫాలోయింగ్ మారిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన సెబాస్టియన్ పీసీ 254, సమ్మతమే, నేను మీకు కావాల్సినవాడిని చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా.. అంతగా ఆకట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వినరో భాగ్యము విష్ణు కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాతో మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఫిబ్రవరి 17న శివరాత్రి సందర్భంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రచారంలో భాగంగా గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో తన కుటుంబంతో కలిసి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఆ జిల్లాల్లో ఈ యంగ్ హీరోకు ఊహించని స్థాయిలో వెల్ కమ్ చెబుతున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో పర్యటించారు. అక్కడ కిరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కారు సన్ రూఫ్ లో నిలబడి అందరికీ అభివాదం చేస్తున్న కిరణ్ పై పూలవర్షం కురిపించారు. అదే సమయంలో పక్కన ఉన్నవారు చేతులు పట్టుకుని లాగారు. మరికొందరు కారు పైకి ఎక్కి మరీ ఈ యంగ్ హీరోకు పూలమాల వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ యంగ్ హీరోకు ఈ స్థాయిలో స్వాగతం లభించడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.