Rashmika: తిరిగి వెనక్కి వెళ్లాలని ఉంది.. రష్మిక చేసిన పోస్ట్‌కు అర్థం అదేనా.?

పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారింది అందాల తార రష్మిక మందన్న. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో డీగ్లామర్‌ రోల్‌లో నటించిన ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ సంపాదించుకుంది. అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా..

Rashmika: తిరిగి వెనక్కి వెళ్లాలని ఉంది.. రష్మిక చేసిన పోస్ట్‌కు అర్థం అదేనా.?
Rashmika
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 17, 2023 | 8:30 AM

పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారింది అందాల తార రష్మిక మందన్న. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో డీగ్లామర్‌ రోల్‌లో నటించిన ఈ బ్యూటీ తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ సంపాదించుకుంది. అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. దీంతో రష్మికకు వరుసగా అవకాశాలు క్కూ కడుతున్నాయి. ఇటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ రష్మిక వరుస సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

ఇదిలా ఉంటే ఉంటే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది రష్మిక. ఈ క్రమంలోనే ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా వెకేషన్స్‌కి ప్లాన్‌ చేస్తుంటుంది. ఇక సోషల్‌ మీడియాలోనూ రష్మికకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ఇలా ఓ పోస్ట్‌ చేస్తే చాలు లక్షల్లో లైక్స్‌ కురుస్తుంటాయి. మొన్నటి మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా రష్మిక మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దిగిన ఫొటోలు నెట్టింట తెగ సందడి చేశాయి.

ఇవి కూడా చదవండి

రష్మిక, విజయ్‌లు ఒకేసారి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో వీరిద్దరు కలిసి వెకేషన్‌కు వెళ్లారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరిద్దరూ విడివిడిగా దిగిన ఫొటోలను పోస్ట్‌ చేశారే తప్ప.. ఒకటిగా దిగినవి షేర్‌ చేయలేదు. ఇదిలా ఉంటే రష్మిక తాజాగా ఇన్‌స్టా్గ్రామ్‌ వేదికగా పోస్ట్ చేసిన ఫొటోలు, దానికి ఇచ్చిన క్యాప్షన్‌ ఆసక్తికరంగా మారింది. గతంలో వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసిన రష్మిక.. ‘తిరిగి వెనక్కి వెళ్లాలని ఉంది’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. అంటే మాల్దీవుల వెకేషన్‌ రష్మికకు ఎంతలా నచ్చింతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక రష్మిక ఈ ఫొటో పోస్ట్ చేసిన కేవలం కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్‌ రావడం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పండి
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
గేమ్ ఛేంజర్‌కు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
మీరూ రాత్రిళ్లు స్వెటర్లు, సాక్స్‌ ధరించి నిద్రపోతున్నారా?
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన సందడి స్పెషల్ ఎట్రాక్షన్గా బాబాలు, సాధువుల
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
థర్డ్‌ పార్టీ యాప్‌ లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
నాకు పెళ్లైంది.. కానీ నెలకు వారం రోజులు మాత్రమే
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
వామ్మో తెలంగాణలో అడుగు పెట్టిన HMPV గత నెలలోనే 11 కేసులుగుర్తింపు
ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?
ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం ఏది?
సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. రామ్ చరణ్ ఏమన్నారంటే?
సినిమాల్లోకి పవన్ కల్యాణ్ కుమారుడు.. రామ్ చరణ్ ఏమన్నారంటే?
ఊపందుకున్న యాసంగి నాట్లు.. పొరుగు రాష్ట్రాల కూలీలకు ఫుల్ డిమాండ్
ఊపందుకున్న యాసంగి నాట్లు.. పొరుగు రాష్ట్రాల కూలీలకు ఫుల్ డిమాండ్