Rashmika Mandanna: రష్మిక వివాదం పై మరోసారి స్పందించిన రిషబ్ శెట్టి.. అలాంటి వారి లిస్ట్ ఎక్కువే ఉందంటూ..
మేము ఎంతో మంది ఆర్టిస్టులను లాంచ్ చేసాము. చాలా మంది దర్శకులు, నిర్మాతలు మాకు అవకాశాలు ఇచ్చారు. అలాంటి వారి లిస్ట్ మా దగ్గర ఎక్కువగానే ఉంది. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు
గతేడాది పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. అదే స్థాయిలోనూ వివాదాల్లో పడింది. ముఖ్యంగా కన్నడిగులు ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమెను ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు సినీ ప్రేక్షకులు. వీటన్నింటికి కారణం పలు ఇంటర్వ్యూలలో రష్మిక చేసిన కామెంట్స్. కాంతార సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశారు రిషబ్ శెట్టి. కర్ణాటక ఆదివాసీల సంప్రదాయం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు దేశమంతా ఫిదా అయ్యింది. సౌత్ టూ నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను వీక్షించారా ? అని ఓ రిపోర్టర్ అడగ్గా.. చూడలేదంటూ రష్మిక ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఆమె పై సీరియస్ అయ్యారు ఫ్యాన్స్. ఆ తర్వాత… తనను కథనాయికగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పకుండా చేతివేళ్లతో సైగలు చేసి చూపించింది.
దీంతో మరోసారి కన్నడిగుల ఆగ్రహానికి గురైంది. పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో అహంకారం ప్రదర్శిస్తోందని.. ఆమెను కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలంటూ నెట్టింట ట్రోలింగ్ జరిగింది. మరోవైపు ఇదే విషయం పై రిషబ్ స్పందిస్తూ.. చేతి వేళ్లతో ఆడిట్యూడ్ చూపించేవాళ్లతో తాను పనిచేయాలనుకోవడం లేదంటూ కౌంటరిచ్చారు. ఇక ఇటీవల ఈ వివాదం పై రష్మిక రియాక్ట్ అవుతూ తమ మధ్య ఎలాంటి గొడవలు ఇచ్చే ప్రయత్నం చేసింది. తాజాగా మరోసారి రష్మిక వివాదం పై స్పందించారు రిషబ్ శెట్టి. ఇటీవల Mashable Indiaకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.
“మేము ఎంతో మంది ఆర్టిస్టులను లాంచ్ చేసాము. చాలా మంది దర్శకులు, నిర్మాతలు మాకు అవకాశాలు ఇచ్చారు. అలాంటి వారి లిస్ట్ మా దగ్గర ఎక్కువగానే ఉంది. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అంటూ చెప్పుకొచ్చారు రిషబ్. అలాగే కిరిక్ పార్టీ చిత్రం విడుదలై ఆరెళ్లు అవుతుందని.. ఇప్పటికీ ప్రజలు చేసిన ఈలలు.. సందడి మా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.r