AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సమంత.. ఆకట్టుకుంటున్న సామ్ లేటేస్ట్ పోస్టర్..

సామ్ శకుంతల పాత్రలో కనిపించనుండగా.. దేవ్ మోహన్ దుష్యంతుడిగా కనిపించనున్నారు. ఈ మైథలాజికల్ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న

Samantha: 'శాకుంతలం' నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సమంత.. ఆకట్టుకుంటున్న సామ్ లేటేస్ట్ పోస్టర్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2023 | 8:22 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్ కథానాయకుడిగా నటించాడు. ఈ మూవీతో దేవ్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇందులో సామ్ శకుంతల పాత్రలో కనిపించనుండగా.. దేవ్ మోహన్ దుష్యంతుడిగా కనిపించనున్నారు. ఈ మైథలాజికల్ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ వచ్చే నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా సామ్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ఆకట్టుకుంటుంది.

శాకుంతలం సినిమా నుంచి మల్లిక మల్లిక అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ను జనవరి 18న విడుదల చేస్తున్నట్లు సమంత తన ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ… సామ్ షేర్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, థియేట్రికల్ ట్రైలర్ మూవీపై అంచనాలను క్రియేట్ చేశాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ఇటీవలే యశోద సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది సామ్. కొద్ది రోజులుగా మయోసైటిస్ సమస్యకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. త్వరలోనే ఆమె డైరెక్టర్ శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న ఖుషి చిత్రీకరణంలో పాల్గొననుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి