AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story: ప్రపంచంలో 42 వేల మంది మహిళలను గర్భవతిని చేసిన ISIS సాక్ష్యం దొరికిందంటున్న కేరళ స్టోరీ చిత్ర యునిట్

కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ షా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విపుల్ షా మాట్లాడుతూ, “మనం కోరుకున్నప్పటికీ మతం మారిన అమ్మాయిలను చేరుకోలేము. ఈ చిత్రంలో చూపించిన ఓ అమ్మాయి షాలిని ఆఫ్ఘనిస్తాన్‌లోని జైల్లో ఉందని చెప్పారు. మరోవైపు నీమా, గీతాంజలి తల్లిదండ్రుల ప్రశంసాపత్రాలను సినిమా చివర్లో ప్రదర్శించమని పేర్కొన్నారు.

The Kerala Story: ప్రపంచంలో 42 వేల మంది మహిళలను గర్భవతిని చేసిన ISIS సాక్ష్యం దొరికిందంటున్న కేరళ స్టోరీ చిత్ర యునిట్
The Kerala Story Movie
Surya Kala
|

Updated on: May 18, 2023 | 12:35 PM

Share

వివాదాల నడుమ విడుదలైన ‘ది కేరళ స్టోరీ‘ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ను అందుకుంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే  విడుదలకు ముందే వివాదాల్లో కూరుకుపోయిన బుల్లితెరపై వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. మే 05న రిలీజైన ది కేరళ స్టోరీ సినిమా కథ.. , మతమార్పిడికి గురైన ముగ్గురు బాలికలపై జరిగిన అణచివేతపై ఆధారపడినది.

కేరళలో నివసించే అమ్మాయిలు బలవంతంగా మత మార్పిడిని చేసుకోవడమే కాదు.. అనంతరం ఎటువంటి  బలవంతం జీవితాన్ని గడుపుతున్నారో తెలియజేస్తుంది. బాధితుల్లో ఒకరు తీవ్రవాద సంస్థ ISSIలో ఎలా చేరారో ది కేరళ స్టోరీ కథాంశం. కేరళ స్టోరీ యదార్థ కథ ఆధారంగా రూపొందించామని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇవి కూడా చదవండి

తాజాగా కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ షా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విపుల్ షా మాట్లాడుతూ, “మనం కోరుకున్నప్పటికీ మతం మారిన అమ్మాయిలను చేరుకోలేము. ఈ చిత్రంలో చూపించిన ఓ అమ్మాయి షాలిని ఆఫ్ఘనిస్తాన్‌లోని జైల్లో ఉందని చెప్పారు. మరోవైపు నీమా, గీతాంజలి తల్లిదండ్రుల ప్రశంసాపత్రాలను సినిమా చివర్లో ప్రదర్శించమని పేర్కొన్నారు. దేశం నుంచి వెళ్లిపోయిన అమ్మాయిలు.. మనకు అందనంత దూరంలో ఉన్నారని తెలిపారు.

నిజమైన స్టోరీనే తెరకెక్కించాం..  విపుల్ షా చెప్పిన విషయాన్ని చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ కొనసాగిస్తూ..  “సినిమా తీయడం వెనుక మా లక్ష్యం అమ్మాయిలను ఎగ్జిబిషన్‌గా చూపించకూడదు. అందుకనే ఈ సినిమా ద్వారా కొంత హ్యూమన్ యాంగిల్ లో చెప్పే ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. గీతాంజలి తల్లిదండ్రుల సాక్ష్యాన్ని సినిమా చివర్లో చూపించాం. వారు కూడా మాకు మద్దతుగా నిలబడాలనుకున్నారు.. అయితే చాలా దూరంగా నివసిస్తున్నారు. దీంతో ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు మూడు రోజులు పడుతుందని చెప్పారు.

ఆధారాలను పంపుతున్న బాధితులు   సుదీప్తో సేన్ ఇంకా మాట్లాడుతూ “50 వేల మంది లేదా 70 వేల మంది ఐఎస్‌ఐఎస్‌లోకి వెళ్లారని సినిమాలో ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలోని ప్రజలు ఇదే విషయంపై స్పందిస్తున్నారు. అంతేకాదు అనేక మంది అమాయక యువతులు ఐఎస్ఐఎస్  చేరారని.. అందుకు రుజువులు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలోని 42 వేల మంది బాలికలు ఐఎస్ఐఎస్ లో చేరారని.. వారు గర్భం దాల్చారని ఈ రోజు కూడా రుజువు చేస్తూ పయనీర్ న్యూయార్క్ పేరుతో ఉన్న ఓ పత్రిక రాసిన ఓ కథనాన్ని తమకు రుజువుగా పంపించారని చెప్పారు. తాము ప్రజలకు అవగాహన కల్పించాలనే ఈ సినిమా తీసినట్లు పేర్కొన్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..