S. Thaman: “ఆ రికార్డు క్రియేట్ చేసిన తొలి ఇండియన్ సినిమా గాడ్ ఫాదర్”.. తమన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు.

S. Thaman: ఆ రికార్డు క్రియేట్ చేసిన తొలి ఇండియన్ సినిమా గాడ్ ఫాదర్.. తమన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
Thaman
Follow us

|

Updated on: Oct 06, 2022 | 8:45 PM

ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.  ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్ గాడ్ ఫాదర్ గురించి ఆసక్తికర విషయలను పంచుకున్నారు.

నాకు ఫస్ట్ హీరో హిట్ సెంటిమెంట్ వుంది. నేను తొలిసారి కలసి పని చేసిన హీరోలందరి సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. మహేష్ బాబు గారితో దూకుడు, రవితేజ గారితో కిక్, ఎన్టీఆర్ గారితో బృందావనం, పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్, బాలకృష్ణ గారితో అఖండ.. ఇలా అన్నీ బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో నేను చేసిన తొలి సినిమా గాడ్ ఫాదర్ కూడా బ్లాక్ బస్టర్ కావడం సెంటిమెంట్ కొనసాగినట్లయింది. చిరంజీవి గారికి మ్యూజిక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ఆయనలో చాలా లేయర్స్ వుంటాయి. అవన్నీ అందుకోవడం అంత ఈజీ కాదు. నేను, దర్శకుడు మోహన్ రాజా ఏడాది పాటు చాలా కష్టపడ్డాం. మ్యూజిక్ కి స్కోప్ లేని సినిమాలో మ్యూజికల్ గా హై తీసుకురావడం ఒక పెద్ద సవాల్. సినిమా చూసిన ప్రేక్షకులు సంగీతం గురించి గొప్పగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా వుంది. గాడ్ ఫాదర్ లో ఒక యూనివర్సల్ బాస్ ఫీలింగ్ సౌండ్ రావాలి. లండన్ లో ప్రతిష్టాత్మక అబేయ్ రోడ్ స్టూడియోస్ లో గాడ్ ఫాదర్ స్కోర్ చేశాం. ఆ స్టూడియో అందరికీ ఇవ్వరు. అక్కడ రికార్డ్ చేసిన తొలి ఇండియన్ సినిమా గాడ్ ఫాదర్.

అలాగే ఇందులో నాకు దర్శకుడు మోహన్ రాజాకి అదే పెద్ద సవాల్. ఇందులో హై పాటలకు అవకాశం లేదు. కథని నడిపే పాటలు కావాలి. నేను.. రాజా అదే విషయం గురించి చాలా మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకున్నట్లుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసి నాకు సినిమా చూపించారు. తర్వాత నేను, రాజా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ కూర్చుని పాటల ప్లేస్ మెంట్స్, సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. అప్పటికే ఆర్కెస్ట్రా వరకూ నేను వర్క్ పూర్తి చేశాను. ఇందులో చేసిన ఆర్ఆర్ కింగ్ డమ్ గా వుంటుంది. మా టీం అందరికీ చిరంజీవి గారంటే ఇష్టం. అందరూ ప్రాణం పెట్టి చేశారు. చిరంజీవి గారు ఒక మహా వృక్షం. ఆ వృక్షానికి నీరు పోయడం అంత తేలిక కాదు. ఎంతపోసిన ఇంకా అడుగుతూనే వుంటుంది. ఆయనకి సినిమా చేస్తున్నపుడు ఆయన గత సినిమాలతో కూడా పోలిక వస్తుంది. మణిశర్మ గారు, కోటి గారు , కీరవాణి గారు .. ఇలా అందరూ చిరంజీవి గారి అద్భుతమైన మ్యూజిక్ చేశారు. మనం నెక్స్ట్ లెవల్ లో ఎలా చేయాలని అలోచిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకొని పని చేశాం. నేను చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ బాయ్ గా పని చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ అనేది సెకండరీ.

ఇవి కూడా చదవండి

గాడ్ ఫాదర్ లో చాలా ఫెరోషియస్ గా వుంటుంది. చాలా పవర్ ఫుల్ ఫైట్ ఉంది. ఆ ఫైట్ కి పాట చేద్దామనే నా అలోచన దర్శకుడు మోహన్ రాజాకి నచ్చింది. వంద చెట్లు చిరంజీవి గారితో కలసి పాడితే ఎలా వుంటుంది ? ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ? అనే ఆలోచన చేసిన ట్యూన్ అది. అనంత శ్రీరాం చాలా లోతుగా ఆ పాటని రాశారు. థియేటర్ లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు తమన్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!