Thalapathy 66: దళపతి బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న వంశీ పైడిపల్లి.. ఆసక్తి గా ఎదురుచూస్తున్న విజయ్ ఫ్యాన్స్

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో సందడి మాములుగా ఉండదు. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన సినిమాలన్నీ వంద కోట్ల మార్క్ ను అవలీలగా దాటేస్తున్నాయి.

Thalapathy 66: దళపతి బర్త్ డే గిఫ్ట్ రెడీ చేస్తున్న వంశీ పైడిపల్లి.. ఆసక్తి గా ఎదురుచూస్తున్న విజయ్ ఫ్యాన్స్
thalapathy 66
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 20, 2022 | 3:27 PM

తమిళ్ స్టార్ హీరో దళపతి(Thalapathy Vjay )విజయ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ లో సందడి మాములుగా ఉండదు. ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన సినిమాలన్నీ వంద కోట్ల మార్క్ ను అవలీలగా దాటేస్తున్నాయి. రీసెంట్ గా బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దళపతి ఆ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు దళపతి 66 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ న పరిశీలిస్తున్నారని టాక్. ఈ సినిమా తెలుగు తమిళ్ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు చిత్రయూనిట్. దళపతి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను ఖుష్ చేయనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విజయ్ పుట్టినరోజు (22జూలై)కి ఒకరోజు ముందుగా అంటే జూలై 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విజయ్ షాడో ఫొటోతో పోస్టర్ ను డిజన్ చేశారు. ఈ సినిమాలో విజయ్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుపనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి
Vijay

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!