తెలుగులో ప్రేమాలయ౦

తమిళంలో సిద్ధార్ధ నటించగా ఘన విజయం సాధించిన కావియ‌ తలైవన్ అనే చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమాలయం’ పేరుతొ అనువదిస్తున్నారు. మాణిక్యం ఆర్ట్ థియేటర్స్ పతాకంపై శ్రీమతి పి.సునీత సమర్పణలో నిర్మాత శ్రీధర్ యచ్చర్ల ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ప్రముఖ‌ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరసన వేదిక, అనైక సోఠి హీరోయిన్స్‌గా నటించగా, మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్ విలన్ […]

తెలుగులో ప్రేమాలయ౦

తమిళంలో సిద్ధార్ధ నటించగా ఘన విజయం సాధించిన కావియ‌ తలైవన్ అనే చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమాలయం’ పేరుతొ అనువదిస్తున్నారు. మాణిక్యం ఆర్ట్ థియేటర్స్ పతాకంపై శ్రీమతి పి.సునీత సమర్పణలో నిర్మాత శ్రీధర్ యచ్చర్ల ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు.

ప్రముఖ‌ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. వసంత బాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరసన వేదిక, అనైక సోఠి హీరోయిన్స్‌గా నటించగా, మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్ విలన్ పాత్ర పోషించారు.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీధర్ యచ్చర్ల మాట్లాడుతూ సిద్ధార్ధ్ హీరోగా నటించి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చిన ప్రేమాలయం చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అరుదైన అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే పాటలు విడుదల చేసి, మార్చ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Published On - 4:01 pm, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu