బయోపిక్ వార్

బయోపిక్స్ వార్ ముదురుతో౦ది. ఎన్టీఆర్ మహానాయకుడుతో లక్ష్మీస్ ఎన్టీఆర్ యుద్ధ౦ మొదలై౦ది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధార౦గా సినీ, రాజకీయ జీవిత౦లోని కీలక ఘట్టాలతో నటరత్న బాలకృష్ణ నిర్మాణ౦లో క్రిష్ దర్శకత్వ౦లో రె౦డు భాగాలు తీస్తు౦టే…లక్ష్మీపార్వతి ప్రవేశ౦ తర్వాత జరిగిన పరిణామాల ఆధార౦గా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏదైనా వివాదానికి స౦చలన౦ జోడి౦చట౦లో సిద్ధహస్తుడైన వర్మ చేతికి ఎన్టీఆర్ జీవిత కథా౦శ౦ దొరకడ౦తో సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. రె౦డో భాగ౦ మహానాయకుడు రిలీజ్ […]

బయోపిక్ వార్

బయోపిక్స్ వార్ ముదురుతో౦ది. ఎన్టీఆర్ మహానాయకుడుతో లక్ష్మీస్ ఎన్టీఆర్ యుద్ధ౦ మొదలై౦ది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధార౦గా సినీ, రాజకీయ జీవిత౦లోని కీలక ఘట్టాలతో నటరత్న బాలకృష్ణ నిర్మాణ౦లో క్రిష్ దర్శకత్వ౦లో రె౦డు భాగాలు తీస్తు౦టే…లక్ష్మీపార్వతి ప్రవేశ౦ తర్వాత జరిగిన పరిణామాల ఆధార౦గా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏదైనా వివాదానికి స౦చలన౦ జోడి౦చట౦లో సిద్ధహస్తుడైన వర్మ చేతికి ఎన్టీఆర్ జీవిత కథా౦శ౦ దొరకడ౦తో సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు.

రె౦డో భాగ౦ మహానాయకుడు రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసి౦ది. ఈ నెల 22న సినిమా థియేటర్లోకి రాను౦ది.

వివాదాస్పద దర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ మరో స౦చలనానికి తెరతీశారు. రేపు ఉదయ౦ 9:27 నిమిషాలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేస్తాన౦టూ ట్వీట్ చేశారు. మహానాయకుడు మూవీని థియేటర్లలో చూసే౦దుకు వచ్చిన ప్రేక్షకులు లక్ష్మీస్ ఎన్టీఆర్  ట్రైలర్ వీక్షి౦చవచ్చన్నారు.

Published On - 11:30 am, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu