AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli: మేకింగ్‌లో రాజమౌళిని ఫిదా చేసిన టాలీవుడ్ డైరెక్టర్! ఏ సినిమా అంటే ఇష్టమో తెలుసా

టాలీవుడ్‌లో ఆ ఇద్దరు దర్శకులు అంటే ఒక క్రేజ్. ఒకరు తన విజువల్ వండర్స్‌తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ శిఖరాగ్రాన నిలబెడితే, మరొకరు తన ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. వీరిద్దరి మేకింగ్ స్టైల్ వేరు, వారు ఎంచుకునే కథాంశాలు వేరు.

SS Rajamouli: మేకింగ్‌లో రాజమౌళిని ఫిదా చేసిన టాలీవుడ్ డైరెక్టర్! ఏ సినిమా అంటే ఇష్టమో తెలుసా
Rajamouli
Nikhil
|

Updated on: Dec 28, 2025 | 10:53 AM

Share

అయితే ఆ స్టార్ డైరెక్టర్‌కు, ఈ లెక్కల మాస్టర్ తీసిన సినిమాల్లో ఒకటంటే ప్రాణం. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటినీ కాదని ఒక విభిన్నమైన చిత్రాన్ని ఆయన తన ఫేవరెట్ అని చెబుతారు. ఆ దర్శకుడు ఎవరో కాదు, మన జక్కన్న. మరి రాజమౌళికి అంతగా నచ్చిన ఆ సుకుమార్ మూవీ ఏంటో తెలుసా?

బాక్స్ ఆఫీస్ హిట్లను కాదని..

సాధారణంగా దర్శకుడు సుకుమార్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి ‘ఆర్య’, ‘రంగస్థలం’ లేదా రీసెంట్‌గా గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘పుష్ప’. ఇవన్నీ కమర్షియల్‌గా భారీ విజయాలను అందుకున్నవే. కానీ రాజమౌళి దృష్టిలో మాత్రం సుకుమార్ బెస్ట్ వర్క్ వేరే ఉంది. సుకుమార్ కెరీర్ ఆరంభంలో తెరకెక్కించిన ‘జగడం’ అంటే రాజమౌళికి చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడిని మెప్పించడం అంటే అది మామూలు విషయం కాదు.

జగడం ఎందుకు స్పెషల్?

‘జగడం’ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా ఉంటుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు. సుకుమార్ మేకింగ్ స్టైల్‌లో ఉన్న డెప్త్, నటీనటుల నుంచి రాబట్టుకున్న పెర్ఫార్మెన్స్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా అందులోని టేకింగ్, కథనంలో ఉండే వేగం తనను ఆకట్టుకుందని జక్కన్న చెబుతుంటారు. ఒక క్రియేటివ్ డైరెక్టర్ మరో డైరెక్టర్ పనిని ఇంతగా గౌరవించడం టాలీవుడ్‌లో ఒక గొప్ప పరిణామం.

Sukumar And Jagadam Poster

Sukumar And Jagadam Poster

రాం చరణ్ – మహేష్ బాబు బిజీ షెడ్యూల్

ప్రస్తుతం ఈ ఇద్దరు దిగ్గజాలు తమ తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ప్లాన్ చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు మళ్ళీ ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. మరోవైపు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్తున్న ఈ దర్శకుల మధ్య ఉన్న ఇలాంటి పరస్పర గౌరవం అభిమానులకు ఎంతో సంతోషాన్నిస్తోంది.

మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..
ప్రపంచ వేదికపై భారత యువ సంచలనాల జైత్రయాత్ర..!
ప్రపంచ వేదికపై భారత యువ సంచలనాల జైత్రయాత్ర..!
అతడు నా ఫేమ్ వాడుకుని వదిలేశాడు.. బిగ్ బాస్ బ్యూటీ
అతడు నా ఫేమ్ వాడుకుని వదిలేశాడు.. బిగ్ బాస్ బ్యూటీ