నయనతార స౦చలన నిర్ణయ౦

నయనతార క్రేజ్ ప్రస్తుతం ఎలా ఉందంటే ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించినా అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. ఈ ఏడాది అజిత్ సరసన విశ్వాసం చిత్రంలో నయనతార నటించింది. మరి కొన్ని క్రేజీ చిత్రాలలో నటిస్తోంది. ఇద్దరు ప్రముఖ హీరోలతో ప్రేమాయణం సాగించిన నయనతార‌ పెళ్లి వరకు వచ్చి వారితో బ్రేకప్ అయింది. శింబు, ప్రభుదేవాతో నయన్ ప్రేమ కథ ఇప్పటికి హాట్ టాపిక్కే. వ్యక్తి గత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నయనతార.. హీరోయిన్ గా మాత్రం […]

నయనతార స౦చలన నిర్ణయ౦

నయనతార క్రేజ్ ప్రస్తుతం ఎలా ఉందంటే ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించినా అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. ఈ ఏడాది అజిత్ సరసన విశ్వాసం చిత్రంలో నయనతార నటించింది. మరి కొన్ని క్రేజీ చిత్రాలలో నటిస్తోంది.

ఇద్దరు ప్రముఖ హీరోలతో ప్రేమాయణం సాగించిన నయనతార‌ పెళ్లి వరకు వచ్చి వారితో బ్రేకప్ అయింది. శింబు, ప్రభుదేవాతో నయన్ ప్రేమ కథ ఇప్పటికి హాట్ టాపిక్కే. వ్యక్తి గత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నయనతార.. హీరోయిన్ గా మాత్రం తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగింది. తాజాగా నయనతార వివాహానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

నయనతార పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.నటిగా అన్ని భాషల్లో కలిపి 100 చిత్రాలు పూర్తి చేసేవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందట.

ప్రస్తుతం నయనతార అన్ని భాషల్లో కలిపి 70కి పైగా చిత్రాల్లో నటించింది. మరో నాలుగు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఈ లెక్కన 100 చిత్రాలు పూర్తి కావాలంటే నాలుగైదేళ్ల సమయం పడుతుంది. దీనితో నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ పరిస్థితి ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. 100 చిత్రాలుపూర్తి చేసి పెళ్లి చేసుకుంటోందో లేక మనసుమార్చుకుని ముందుగానే పెళ్ళిపీటలు ఎక్కుతుందో చూడాలి.

Published On - 10:24 am, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu