Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Madhu Priya: తెలంగాణ రాజకీయాల్లోకి సింగర్‌ మధు ప్రియ..! భుజంపై ఎర్ర కుండువాతో హల్‌చల్‌..

కొద్ది రోజుల క్రితం ఫోక్ సింగర్ సాయి చందు మరణం తర్వాత మధుప్రియ అసిఫాబాద్ సభలో సాయి చందు ప్లేసులో ప్రత్యక్షమవడంతో మధుప్రియ పైన ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ నిర్వహించే ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్ కైనా సాయి చందు నేతృత్వం వహించేవాడు. అలాంటిది సాయి చందు చనిపోయిన రెండో రోజే జరిగిన సభలో మధుప్రియ ప్రత్యక్షమవడం ఒకసారిగా సంచలనంగా మారింది. సాయి చందు మరణం తర్వాత తన తోటి సింగర్లతో ఆమె వ్యవహరించిన తీరు, తాజాగా ప్రజా గాయకుడు గద్దర్ మరణం తర్వాత..

Singer Madhu Priya: తెలంగాణ రాజకీయాల్లోకి సింగర్‌ మధు ప్రియ..! భుజంపై ఎర్ర కుండువాతో హల్‌చల్‌..
Singer Madhu Priya
Follow us
Vijay Saatha

| Edited By: Srilakshmi C

Updated on: Aug 11, 2023 | 5:14 PM

హైదరాబాద్‌, ఆగస్టు 11: ‘ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనమ్మా..’ అంటూ ఒక చిన్న పిల్ల పాడిన పాట తెలంగాణ రాష్ట్రాన్ని ఊపేసింది, సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అదే పిల్ల పాడిన వచ్చిండే.. వచ్చిండే అనే పాట సంచలనగా మారింది. ఈ రెండు పాటల్లో మనం చెప్పుకుంటుంది తెలంగాణ ఫోక్ అండ్ ప్లే బ్యాక్ సింగర్ మధుప్రియ గురించే.. చిన్నపిల్లల నుంచి పండు ముసళ్ళదాక మధుప్రియ అంటే తెలియని వాళ్ళు లేరు. అలాంటి మధుప్రియ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కబోతున్నారు. మధుప్రియ పాటకి పెట్టింది పేరు .. మధుప్రియ చిన్న వయసులోనే బెస్ట్ ఫోక్ సింగర్ గా ప్లే బ్యాక్ సింగర్ గా మంచి పేరు సంపాదించుకుంది… ఇదంతా బాగానే ఉంది కానీ మధుప్రియ ఇప్పుడు సడన్ గా వార్తలోకి ఎక్కారు.

ఎర్ర టవల్‌తో హల్చల్

కొద్ది రోజుల క్రితం ఫోక్ సింగర్ సాయి చందు మరణం తర్వాత మధుప్రియ అసిఫాబాద్ సభలో సాయి చందు ప్లేసులో ప్రత్యక్షమవడంతో మధుప్రియ పైన ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ నిర్వహించే ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్ కైనా సాయి చందు నేతృత్వం వహించేవాడు. అలాంటిది సాయి చందు చనిపోయిన రెండో రోజే జరిగిన సభలో మధుప్రియ ప్రత్యక్షమవడం ఒకసారిగా సంచలనంగా మారింది. సాయి చందు మరణం తర్వాత తన తోటి సింగర్లతో ఆమె వ్యవహరించిన తీరు, తాజాగా ప్రజా గాయకుడు గద్దర్ మరణం తర్వాత ఆమె చుట్టూ జరిగిన ఒక సంఘటన ఆమెను రాజకీయాల్లోకి వస్తుందన్న చర్చకు దారి తీసింది. ప్రత్యక్ష రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని మధుప్రియ తెలంగాణ రాజకీయాల్లోకి రావాలంటుకుంటుందన్న గుసగుసలు ప్రారంభమయ్యాయి.

Singer Madhu Priya

Singer Madhu Priya

ఇవి కూడా చదవండి

ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణం తర్వాత ఆమె ఎర్రటి కండువా భుజం పైన వేసుకుని ఎల్బీ స్టేడియం అంతా కలియ తిరిగారు. ఆమె చుట్టూ కుటుంబ సభ్యులతో పాటుగా చాలామంది యంగ్ ఫోక్ సింగర్స్ ఉన్నారు. అనేకమంది లీడర్లతో మాట్లాడుతూ మధుప్రియ అక్కడికి వచ్చిన గద్దర్నీ నివాళులు అర్పించడానికి వచ్చిన అందరితో మాట్లాడుతూ తిరిగారు. ఆమె తిరుగుతున్నంతసేపు ఆమె భుజం పైన ఒక ఎర్రటి కండువా కనిపించింది. ఇక ఎల్బీ స్టేడియం నుంచి ఆల్వాల్ వరకు జరిగిన గద్దర్ అంతిమయాత్రలో సైతం అదే కండువాతో ఆమె కనిపించారు. తన భుజం పైన ఉన్న ఎర్రటి కండువా గురించి అందరూ అడిగిన మధుప్రియ మాత్రం ఏ మాత్రం స్పందించలేదు.

మధుప్రియ రాజకీయ అరంగెట్రం అప్పుడేనా..?

మధుప్రియ సొంత ఊరు గోదావరిఖని. ఇది రామగుండం నియోజకవర్గంలో ఉంది. దీంతో రామగుండం నియోజకవర్గం నుంచి ఆమె పొలిటికల్ ఎంట్రీ ప్రారంభం కాబోతున్న చర్చ ప్రారంభమైంది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబంలో పుట్టిన మధుప్రియ అక్కడి నుంచే తన రాజకీయ అరంగేట్రం చేయడానికి ప్లాన్ వేసుకున్నట్టుగా తెలుస్తోంది. రామగుండం నియోజకవర్గం జనరల్ కాన్స్టెన్సీ కావడంతో ఆమె రాజకీయ భవిష్యత్తు రామగుండం నుంచే ప్రారంభమవుతుందని చర్చ అయితే ప్రారంభమైంది. ఇప్పటికిప్పుడు రాజకీయాలకు రాకపోయినా రానున్న ఐదేళ్ల కాలంలో ఆమె మరింతగా ప్రజల్లోకి చొచ్చుకపోయి రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ అయితే స్టార్ట్ అయింది. చూడాలి ఫోక్ సింగర్ గా తెలంగాణలో పేరు సంపాదించిన మధుప్రియ రాజకీయాలకు వస్తారా లేకుంటే ఫోక్ సింగర్ గా, ప్లే బ్యాక్ సింగర్ గాని మిగిలిపోతారు అన్నది చూడాల్సింది. కానీ ఆమె రాజకీయ అరంగేయటంపై ఎవరు అడిగినా చూద్దాంలే అనే సమాధానమే మధుప్రియ నుంచి వస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి మధుప్రియ రాజకీయాల్లోకి వస్తారా.. రారా..? అన్నది కొద్ది రోజుల్లో ఆమె ద్వారానే తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.