Bigg Boss 7 Telugu: అరరే.. ఈసారి అంతా ఉల్టా పుల్టా.. బిగ్ బాస్ 7 కొత్త ప్రోమో చూశారా?..
ఇప్పటికే లోగో ప్రోమో రిలీజ్ చేస్తూ.. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.. ఇక ఈ షో కోసం తెలుగు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోమోస్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచేస్తున్నారు నిర్వహకులు. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు.
బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7 సందడి స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే నెట్టింట కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ లిస్ట్ చక్కర్లు కొడుతుంది. యంగ్ హీరోహీరోయిన్స్.. సీరియల్ స్టార్స్.. యాంకర్స్.. యూట్యూబర్స్ ఈసారి ఎక్కువగా ఫేమస్ అయిన వారినే ఇంట్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే లోగో ప్రోమో రిలీజ్ చేస్తూ.. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.. ఇక ఈ షో కోసం తెలుగు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోమోస్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచేస్తున్నారు నిర్వహకులు. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. ఇక ఈసారి అంతా ఉల్టా పల్టా అంటూ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ హోస్ట్ నాగార్జున ఏం చెప్పాలనుకుంటున్నారో చూడాల్సిందే.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. రాధ, రమేశ్ అనే ప్రేమికుల ఓ కొండ వద్ద ఉంటారు.. ఎత్తైన కొండ నుంచి రమేశ్ పడిపోతుండగా..తన చున్నీ విసిరి అతడిని కాపాడుతుంటుంది రాధా. దీంతో రమేశ్.. ఈ ప్రపంచంలో మనల్ని ఏ శక్తీ విడదీయలేదు అంటూ ఊపిరి పీల్చుకుంటాడు. ఇక అప్పుడే నాగార్జున వచ్చిన ఇలాంటి ఎండింగ్స్ బోలేడు చూశాం కదా.. ఇప్పుడు ఎండింగ్ మార్చేద్దాం. ఇది అంతం కాదు.. ఆరంభం అంటూ చిటికె వేశాడు. దీంతో రాధా, రమేశ్ మధ్య సీన్ పూర్తిగా మారిపోతుంది. రాధకు తుమ్ము రావడంతో చున్నీ వదిలేస్తుంది. ఇంకేముంది రమేశ్ లోయలో పడిపోతాడు. ఎక్కడున్నావ్ అని రాధా చూసేసరికి రమేశ్ లోయలో పడిపోతుంటాడు. ఇక అప్పుడే నాగార్జున వచ్చి ఇది ఎవరి ఊహకు అందని సీజన్. బిగ్ బాస్ 7. అంతా ఉల్టా పుల్టా అంటూ చెప్పేశాడు.
ఇక తాజా ప్రోమోతో మరింత క్యూరియాసిటిని పెంచేశారు. ఈసారి ఇంట్లో జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ తన భార్య తేజస్వినితో కలిసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే యూట్యూబర్ శ్వేత నాయుడు, యాంకర్ రష్మీ, కార్తిక దీపం ఫేమ్ శోభా శెట్టి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 వచ్చే ఆదివారం స్టార్ట్ కాబోతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.