Babu Mohan: చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. నాన్న వదిలేశాడు.. చంటి పిల్లాడిలా ఏడ్చేసిన బాబు మోహన్
బాబు మోహన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆయన పేరు వింటేనే చాలామంది పెదాలపై నవ్వు వచ్చే్స్తుంది. అంతలా తన నటనతో ప్రేక్షకుల మనసులను గెల్చకున్నారాయన. కమెడియన్‌గా, విలన్‌గా, హీరోగా, స్పెషల్ రోల్స్‌గా.. ఇలా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు బాబు మోహన్. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్‌లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే చాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవారు జనాలు
బాబు మోహన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆయన పేరు వింటేనే చాలామంది పెదాలపై నవ్వు వచ్చే్స్తుంది. అంతలా తన నటనతో ప్రేక్షకుల మనసులను గెల్చకున్నారాయన. కమెడియన్‌గా, విలన్‌గా, హీరోగా, స్పెషల్ రోల్స్‌గా.. ఇలా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు బాబు మోహన్. ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్‌లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే చాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవారు జనాలు. అయితే వెండితెరపై నవ్వుల పువ్వులు పంచిన ఈ ఇద్దరి నటుల జీవితాల్లో ఒక విషాదం దాగుంది. వీరిద్దరి కుమారులు రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. ఇప్పటికీ ఆ చేదు సంఘటనలు గుర్తుచేసుకుని తల్లిడిల్లీపోతుంటారీ లెజెండరీ యాక్టర్స్. కాగా గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న బాబు మోహన్ ఇటీవల ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాలో కనిపించారు. అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపిస్తున్నారు. తాజాగా ఓ టీవీ షోకు జడ్జిగా వచ్చిన బాబు మోహన్ తన చిన్ననాటి దీన పరిస్థితులను గుర్తుతెచ్చుకున్నారు. చిన్న పిల్లలు వేసిన ఎమోషనల్ స్కిట్ చూసి ఎమోషనల్ అయిన ఆయన చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు. ఇది అక్కడున్న వారందరి హృదయాలను కలచివేసింది.
నాన్న వదిలేసి వెళ్లిపోవడంతో ఏం చేయాలో తోచలేదు..
‘నేను మూడో తరగతి చదువుతుండగానే అమ్మ చనిపోయింది.. నన్నూ, నా చెల్లిని నాన్న వదిలేసి తనదారి తను చూసుకున్నాడు. ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియదు. మమ్మల్ని ఎవరూ కనీసం పట్టించుకోలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇద్దరమూ ఎన్నో కష్టాలు పడుతూ చదువుకున్నాం. చిన్నప్పటి నుంచి నా చెల్లికి తల దువ్వి జడ వేసి దగ్గరుండి చూసుకున్నాను’ అంటూ కంటతడి పెట్టారు బాబు మోహన్. కాగా సినిమాలకు దూరంగా ఉన్న బాబు మోహన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. 1998 బై ఎలక్షన్స్‌లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆతర్వత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్లీ విజయం సాధించారు. అయితే 2018లో బీజేపీలో చేరారు. ఇటీవల పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నారు.
బాబు మోహన్ ఫేస్ బుక్ ఫొటోస్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.