Taraka Ratna: ‘అమ్మా.. ఇంకోసారి ఏడిస్తే మాత్రం’.. మనసులను కదిలిస్తోన్న తారకరత్న కూతురు ఎమోషనల్ నోట్
చాలామంది తారకరత్న మన మధ్య లేడంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి నిత్యం భర్తతో మధురజ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుని కన్నీరుమున్నీరవుతోంది. ఆమెను ఓదార్చాడం ఎవరి తరం కావడం లేదు.
ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. టీడీపీ యువ నేత నారా లోకేశ్ పాదయాత్రలో గుండెపోటుకు గురైన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు. ఇది నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది. ఇప్పటికీ చాలామంది తారకరత్న మన మధ్య లేడంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి నిత్యం భర్తతో మధురజ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుని కన్నీరుమున్నీరవుతోంది. ఆమెను ఓదార్చాడం ఎవరి తరం కావడం లేదు. అప్పుడప్పుడు తన ఆవేదనను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంటోంది. ఆ మధ్యన తారకరత్న చిన్న కర్మ, పెద్ద రోజున తారకరత్నను తలచుకుంటూ ఎమోషనల్ పోస్టులు షేర్ చేసింది అలేఖ్య. అలాగే వాలంటైన్స్‌డే రోజున తారకరత్న రాసిన ప్రేమలేఖ, తిరుమలలో ఫ్యామిలీతో కలిసి చివరిసారిగా దిగిన ఫొటోను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తాజాగా తారకరత్న కూతురు నిషిక రాసిన నోట్ అందరినీ కదిలిస్తోంది.
‘అమ్మా నువ్వు చాలా ఆవేదనలో ఉన్నావు. నువ్వు ఇంకోసారి ఏడిస్తే.. నేను నీకు గుడ్‌బై చెబుతాను’ అని నోట్ రాసింది. ఈ లేఖను అలేఖ్యా రెడ్డి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. నిన్ను చాలా మిస్సవుతున్నానంటూ మరోసారి ఎమోషనలైంది. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా ఈ నోట్ నిలుస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..