Anudheep KV: తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మరో తమిళ్ హీరో… ఆ స్టార్‏తో మూవీ చేయబోతున్న “జాతిరత్నాలు” డైరెక్టర్..

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోల కన్ను టాలీవుడ్ పై పడింది. ఇప్పటి వరకు తమ సినిమాలను తెలుగులోకి డబ్ చేసుకుని సూపర్ హిట్స్ అందుకున్న హీరోలు ఇప్పుడు.. నేరుగా తెలుగులో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Anudheep KV: తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మరో తమిళ్ హీరో... ఆ స్టార్‏తో మూవీ చేయబోతున్న జాతిరత్నాలు డైరెక్టర్..
Anudheep Kv
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 12, 2021 | 9:05 PM

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోల కన్ను టాలీవుడ్ పై పడింది. ఇప్పటి వరకు తమ సినిమాలను తెలుగులోకి డబ్ చేసుకుని సూపర్ హిట్స్ అందుకున్న హీరోలు ఇప్పుడు.. నేరుగా తెలుగులో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమిళ్ హీరోలు, విజయ్, ధనుష్‏లు తమ తెలుగు సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు మరికొందరు హీరోలు కూడా టాలీవుడ్‏లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ స్టార్ హీరోను తెలుగులోకి తీసుకువస్తున్నాడు డైరెక్టర్ అనుదీప్.

ఇటీవల “జాతిరత్నాలు” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనుదీప్ తన రెండవ సినిమాను తమిళ స్టార్ హీరోతో తీయబోతున్నారట. వీరిద్దరి కాంబోలో వచ్చే ఆ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన చర్చలు దాదాపు ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఏషియన్ అధినేత సునీల్ నారంగ్ నిర్మించబోతున్నారట. ఈయన కూడా గత కొన్ని రోజులుగా భారీ చిత్రాలను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అయితే జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన అనుదీప్ ఏ హీరోను తెలుగులోకి తీసుకురాబోతున్నారో తెలుసా ? రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ కార్తికేయన్ అనుదీప్ దర్శకత్వంలో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

అయితే ఇప్పటివరకు అనుదీప్ జాతిరత్నాలు సిక్వెల్ చేస్తున్నట్లుగా టాక్ వినిపించింది. కానీ అనుహ్యాంగా ఇప్పుడు శివ కార్తికేయన్ పేరు వినిపించడం కాస్తా ఆశ్చర్యకరమే. ఇక వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా తర్వలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ కాంబో లో మూవీని కేవలం తెలుగు మరియు తమిళంలో మాత్రమే కాకుండా హిందీ మరియు మలయాళంలో కూడా విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ నటించబోతుందని సమాచారం. ఏదైమైనా అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ సినిమా అంటే మరో జాతిరత్నాలే ఇక.

Also Read: Skylab Movie: ప్రపంచం నాశనం అవుతుందన్నారు.. కానీ వారి జీవితాల్లో ఏం జరిగింది.. ఆసక్తికరంగా ‘స్కైలాబ్’ ఫస్ట్‏లుక్ పోస్టర్..

Priyanka Chopra: పదేళ్లలో ప్రియాంక విడాకులు తీసుకుంటుంది.. బాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు..

Ariyana Glory: నువ్వు ప్రేమలో ఉన్నావా ? ఆసక్తికర సమాధానమిచ్చిన అరియానా.. ఇప్పుడే ఎక్కువ ఇష్టమంటూ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!