AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: మొదలైన సర్కారు వారి పాట ..శరవేగంగా షూటింగ్.. హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ న్యూ గెటప్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు 40శాతం పూర్తయింది.

Sarkaru Vaari Paata: మొదలైన సర్కారు వారి పాట ..శరవేగంగా షూటింగ్.. హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్
Mahesh
TV9 Telugu Digital Desk
| Edited By: Rajeev Rayala|

Updated on: Jul 13, 2021 | 4:17 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ న్యూ గెటప్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు 40శాతం పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతుంది తెలుస్తుంది.  14 రీల్స్ ప్లస్ అలాగే మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగు ‘దుబాయ్’లో జరిగింది. ఆ తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతూ ఉండగా, కరోనా కారణంగా షూటింగుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి తగ్గడం వలన, ఈ రోజున హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగును మళ్లీ మొదలుపెట్టారు. మహేశ్ బాబు తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో భారీ సౌండింగ్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ లో మహేష్ బాబు లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇప్పటి నుంచి పెద్దగా గ్యాప్ లేకుండా 3 నెలల పాటు చిత్రీకరణను జరిపి, షూటింగు పార్టును పూర్తిచేయనున్నట్టు చెబుతున్నారు. ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ రోజున టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ షూటింగ్ తిరిగి ప్రారంభించింది  ఈ చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడిస్తూ.. మహేష్ తో పరశురామ్ ఏదో డిస్కష్ చేస్తున్నట్లు కనిపించే ఓ ఫోటోని వదిలారు. ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Anudheep KV: తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న మరో తమిళ్ హీరో… ఆ స్టార్‏తో మూవీ చేయబోతున్న “జాతిరత్నాలు” డైరెక్టర్..

Aamir Khan: అమీర్ ఖాన్‏పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ.. అలాంటి వ్యక్తులు దేశ జనాభాలో…

ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? టాలీవుడ్‏లో ఫుల్ బిజీ ఈ ముద్దుగుమ్మ..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..