Ajith Kumar: తెలుగులో రిలీజ్ కానున్న అజిత్ సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా ? ..

డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి దగ్గరైన అజిత్ తన కొత్త సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి బరిలోకి అజిత్ కుమార్ తెగింపు అంటూ రాబోతోన్నారు. తునివు అనే టైటిల్ తో తమిళంలో సందడి చేయనున్న అజిత్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగింపు అనే టైటిల్‌తో రాబోతోన్నారు

Ajith Kumar: తెలుగులో రిలీజ్ కానున్న అజిత్ సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా ? ..
Ajith Kumar
Follow us

|

Updated on: Dec 22, 2022 | 6:41 AM

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‏కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న కథానాయకులలో అజిత్ ఒకరు. తమిళం, తెలుగులో స్టార్ హీరోగా అజిత్ కుమార్‌కు అసామాన్యమైన అభిమాన గణం ఉంది. ఆయన నటించే సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇక డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి దగ్గరైన అజిత్ తన కొత్త సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి బరిలోకి అజిత్ కుమార్ తెగింపు అంటూ రాబోతోన్నారు. తునివు అనే టైటిల్ తో తమిళంలో సందడి చేయనున్న అజిత్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగింపు అనే టైటిల్‌తో రాబోతోన్నారు.

తలా అంటూ ముద్దుగా పిలుచుకునే అజిత్‌ కుమార్ సినిమాలకు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులోనూ అజిత్ సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి బరిలోకి తెగింపు అంటూ అజిత్ రాబోతోన్నాడని తెలియడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా.. డైరెక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కించారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేశారు.

ఇవి కూడా చదవండి

రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంయుక్తంగా తెగింపు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. సంక్రాంతి బరిలో దిగబోతోన్నట్టుగా మేకర్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అజిత్ కుమార్ ఎంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన అఫీషియల్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖణి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు