AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న తెలంగాణ ఫోక్ సాంగ్.. 80 కోట్ల వ్యూస్‌తో సంచలనం.. తొలి జానపదంగా రికార్డు

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ పాటలు దుమ్ము రేపుతున్నాయి. సినిమా పాటలకు మించి వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. అలా ఓ తెలంగాణ ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 80 కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

Folk Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న తెలంగాణ ఫోక్ సాంగ్.. 80 కోట్ల వ్యూస్‌తో సంచలనం.. తొలి జానపదంగా రికార్డు
Telugu Folk Song
Basha Shek
|

Updated on: Apr 05, 2026 | 12:03 PM

Share

గత కొన్నేళ్లుగా ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఏలేస్తున్నాయి. అందులోనూ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు అయితే సినిమా పాటలకు మించిన వ్యూస్ వస్తున్నాయి. పెళ్లిళ్లు, పండగలు, జాతరలు, స్కూల్ ఫంక్షన్లు, ఈవెంట్లు.. ఎక్కడ చూసినా మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ వినపడాల్సిందే.. మాస్ స్టెప్పులు పడాల్సిందే. ఈ నేపథ్యంలో ఒక తెలంగాణ ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 800 మిలియన్ల (80 కోట్ల) వ్యూస్ సొంతం చేసుకుంది. తద్వారా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తెలుగు జానపదంగా రికార్డు సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ పాట ఏదనుకుంటున్నారా? బిగ్ బాస్ ఫేమ్ రామూ రాథోడ్ స్వయంగా రాసి ఆలపించిన ‘రానూ బొంబాయికి రానూ’. గత కొన్నినెలలుగా ఈ ఫోక్ సాంగ్ సోషల్ మీడియాను వూపేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా లిరిక్స్, ఆకట్టుకునే ట్యూన్ ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే చిన్న పిల్లల నుంచి ముసలి వయసు వారు కూడా ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో ఈ సాంగ్ కు భారీ స్పందన వస్తోంది.

ఇప్పటివరకు తెలుగులో అత్యధిక వ్యూస్ వచ్చిన తెలుగు పాట అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్ పేరిట ఉంది. అయితే తెలుగు జానపదా పాట విషయానికి వస్తే.. 80 కోట్ల వ్యూస్ తో ‘రానూ బొంబాయికి రానూ’ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాటకు రాము రాథోడే స్వయంగా లిరిక్స్ రాసి ఆలపించడం విశేషం. అలాగే కళ్యాణ్ కీస్ సంగీతం అందించారు. శేఖర్ వైరస్ మాస్టర్ రూపొందించిన స్టెప్పులు పాటకు మరింత జోష్ తీసుకొచ్చాయి. వేములవాడ ప్రాంతంలో ప్రధానంగా ఈ సాంగ్ షూటింగ్ చేశారు. క్లైమాక్స్ సీన్స్ కోసం జగిత్యాలలో చిత్రీకరణ జరిపారు.

ఇవి కూడా చదవండి

కాగా ‘రానూ బొంబాయికి రానూ’ సాంగ్ కు సుమారు 3 నుంచి 5 లక్షల మధ్య బడ్జెట్‌ ఖర్చు పెట్టారు. మనదేశంలో ఫోక్ సాంగ్స్ కంటెంట్ కు సాధారణంగా 1000 వ్యూస్‌కు సుమారు రూ.20 నుంచి రూ.40 వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన 800 మిలియన్ల వ్యూస్‌కు సుమారు రూ.1.6 కోట్ల నుంచి రూ.3.2 కోట్ల వరకు రెవెన్యూ రావచ్చు. యూట్యూబ్ వాటా తీసేస్తే సాంగ్ క్రియేటర్‌కు దాదాపు రూ. 1.5 కోట్ల మధ్య ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో చాలా లెక్కలుంటాయి. ఆదాయం ప్రకటనలు, అలాగే యూట్యూబ్ CPM (కాస్ట్ పర్ మైల్) ఆధారంగా ఈ ఆదాయం మారుతూ ఉంటుంది.

‘రానూ బొంబాయికి రానూ’ వీడియో సాంగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us