Baahubali: బాహుబలి రీ యూనియన్ పార్టీకి డుమ్మా కొట్టిన అనుష్క, తమన్నా.. కారణమదేనా?
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. ఈ సినిమా విడుదలై గురువారం(జూలై 10) తో పది సంవత్సరాలు అయింది. ఈ ఆనందంలో, చిత్ర బృందం రీయూనియన్ పార్టీ గ్రాండ్ గా నిర్వహించింది. ప్రభాస్, రానాతో సహా చాలా మంది నటులు, నటీమణులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కానీ సినిమాలోని హీరోయిన్లు అనుష్క శెట్టి, తమన్నా మాత్రం హాజరు కాలేదు.

‘ బాహుబలి ‘ సినిమా భారతీయ సినిమా గతిని మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమా చరిత్రను మార్చిన సినిమా. భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి భారీ లాభాలు ఆర్జించవచ్చని చూపించిన సినిమా బాహుబలి. అంతే కాదు, భారతీయ పౌరాణిక కథలకు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించే శక్తి ఉందని కూడా ఈ విజువల్ వండర్ నిరూపించింది. ఇవే కాదు ‘బాహుబలి’ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. ఇంత అద్భుతమైన సినిమా విడుదలై గురువారం (జూలై 10) నాటికి పదేళ్లు పూర్తయింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ జూలై 10, 2015న విడుదలైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ‘బాహుబలి’ బృందం రీయూనియన్ ఏర్పాటు చేసింది. ‘బాహుబలి’ చిత్రానికి పనిచేసిన నటులు, నటీమణులు, సాంకేతిక నిపుణులు కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. బాహుబలి సినిమా షూటింగ్ నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి, నటులు ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, నిర్మాత శోభు యరాలగడ్డ, కెమెరామెన్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్లు సాబు సిరిల్, విజయ్ ప్రకాష్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లైన్ ప్రొడ్యూసర్ శ్రీవల్లి, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి, కార్తికేయ తదితరులు బాహుబలి రీయూనియన్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు గా నటించిన అనుష్క శెట్టి, తమన్నా భాటియా ఈ రీయూనియన్ పార్టీలో కనిపించలేదు.
తమన్నా భాటియా, అనుష్క శెట్టి ‘బాహుబలి’ నిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, వారిద్దరూ వేడుకకు హాజరు కాలేదు. సినిమా వర్గాల సమాచారం ప్రకారం, తమన్నా, అనుష్క శెట్టి ఇద్దరినీ ఈ వేడుకకు ఆహ్వానించారు. కానీ వారిద్దరూ వేర్వేరు కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. తమన్నా భాటియా ఏదో షూటింగ్‌లో పాల్గొన్నట్లు చెబుతోంది. మరోవైపు, అనుష్క శెట్టి ‘ఘాటి’ సినిమా కోసం బిజి బిజీగాఉంటోంది. అలాగే ఈ సినిమా లుక్ రివీల్ కాకుండా ఉండడానికే అనుష్క ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అలాగే, ఆమె ‘ఘాటి’ సినిమా బృందానికి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘ఘాటి’ సినిమా ప్రమోషన్‌లకు తాను రానని, కొన్ని ఈవెంట్లకు మాత్రమే హాజరవుతానని క్లారిటీ ఇచ్చేసింది.
బాహుబలి రీయూనియన్ పార్టీలో ప్రభాస్..
10 Years of Baahubali Reunion…🥳❤️🔥#Celebrating10YearsOfBaahubali #DecadeofBaahubaliReign #Baahubali #BaahubaliTheEpic #Prabhas #RanaDaggubati #SSRajamouli #anushkashetty #Tamannaah #MMKeeravani #RamyaKrishnan #Sathyaraj #SriBalajiVideo pic.twitter.com/G9tHOqXMol
— Sri Balaji Video (@sribalajivideos) July 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








