AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya : రీ రిలీజ్‌కు రెడీ అయిన సూర్య మరో సూపర్ హిట్ మూవీ..

స్టార్ హీరోల సినిమాలు ఇప్పటికే చాలా రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. సూపర్ హిట్ సినిమాలే కాదు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ సాధించాయి. ఈ క్రమంలోనే తమిళ్ డబ్బింగ్ మూవీస్ కూడా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో సూర్య హీరోగా నటించిన సూర్య సన్ ఆఫ్ క్రిషన్ సినిమా ఒకటి.

Suriya : రీ రిలీజ్‌కు రెడీ అయిన సూర్య మరో సూపర్ హిట్ మూవీ..
Surya
Rajeev Rayala
|

Updated on: Nov 22, 2023 | 2:16 PM

Share

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల హడావిడి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. పోకిరి సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్‌ల సందడి ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. స్టార్ హీరోల సినిమాలు ఇప్పటికే చాలా రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. సూపర్ హిట్ సినిమాలే కాదు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ సాధించాయి. ఈ క్రమంలోనే తమిళ్ డబ్బింగ్ మూవీస్ కూడా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో సూర్య హీరోగా నటించిన సూర్య సన్ ఆఫ్ క్రిషన్ సినిమా ఒకటి. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు హరీష్ జై రాజ్ సంగీతం అందించారు. ఈ సినిమా రీ రీలీజ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు మరో సూర్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. సూర్య హీరోగా నటించిన సినిమా వీడోక్కడే. కే వి ఆనంద్  దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ కథనంతో తెరకెక్కింది. ఈ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.

త్వరలోనే వీడోక్కడే సినిమాను రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు హారిస్ జై రాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.