Tollywood: చూపుల బాణాలు విసురుతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. అక్కినేని హీరోతో నటించి అలరించింది..
చూపుల బాణాలు విసుతురున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువగానే అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి అలరించిన ఈబ్యూటీకి తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. అక్కినేని హీరో సరసన నటించి తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటనకు ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది

చూపుల బాణాలు విసుతురున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువగానే అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి అలరించిన ఈబ్యూటీకి తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. అక్కినేని హీరో సరసన నటించి తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటనకు ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది ఈ బ్యూటీ. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే ఆకాంక్ష సింగ్. అక్కినేని సుమంత్ నటించిన మళ్లీ రావా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా తర్వాత మరోసారి అక్కినేని హీరోకు జోడిగా నటించిన అదృష్టం మాత్రం కలిసిరాలేదు. దీంతో ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది.
తాజాగా బ్లూకలర్ శారీలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఆకాంక్ష సింగ్.. జైపూర్ లో జన్మించింది. సినిమాల్లోకి రాకముందు రచయిత్రిగా, ఫిజియోథెరపిస్ట్ గా పనిచేసింది. ముందు బాలీవుడ్ ఇండస్ట్రీలో సీరియల్స్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. దాదాపు పది సీరియల్స్ చేసింది. ఇక ఆ తర్వాత మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించిన ఆకాంక్ష సింగ్.. తెలుగులో మాత్రం మళ్లీ రావా సినిమాతోనే పరిచయమైంది. ఈ సినిమాలోని తన నటనకుగానూ 2018లో సైమా అవార్డ్ అందుకుంది.
View this post on Instagram
మూడు పాపులర్ టీవీ సీరియల్లలో నటించిన ఆకాంక్ష.. ఆ తర్వాత వరుణ్ ధావన్, అలియా భట్ జంటగా నటించిన బద్రీనాథ్ కీ దుల్హానియా సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీలో హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత మళ్లీ రావా సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్ల మదిని దొచేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.