AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadar 2 : బాక్సాఫీస్ వద్ద గదర్ 2 సంచలనం.. చరిత్ర సృష్టించిన సన్నీ డియోల్..

ఈ జనరేషన్‌కు బాలీవుడ్‌ అంటే షారుక్, సల్మాన్, అమీర్, అక్షయ్ మాత్రమే. కానీ వీళ్ళందరి కంటే ముందే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఒకరున్నారక్కడ.. అతడే సన్నీ డియోల్. తాజాగా గదర్ 2తో ఒక్కసారిగా జూలు విదిల్చారీ హీరో. ఈయన పంజా దెబ్బకు పఠాన్ రికార్డ్స్ కూడా కదిలేలా ఉన్నాయిప్పుడు. 500 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో సినిమాగా చరిత్ర సృష్టించింది గదర్ 2.

Gadar 2 : బాక్సాఫీస్ వద్ద గదర్ 2 సంచలనం.. చరిత్ర సృష్టించిన సన్నీ డియోల్..
Gadar 2 movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Sep 06, 2023 | 4:58 PM

Share

సింహం రెండడుగులు వెనక్కి వేసిందంటే.. 10 అడుగులు ముందుకు వేయడానికే అంటారు. బాలీవుడ్‌లో ఓ హీరోను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఫేడవుట్ అయిపోయాడు.. 20 ఏళ్ళ నుంచి హిట్ లేదు.. ఆయనేం చేస్తాడు.. అసలు ఆడియన్స్‌కు గుర్తు ఉన్నాడా అనుకున్నారు. కానీ సల్మాన్, అమీర్ ఖాన్‌కు కూడా సాధ్యం కాని రికార్డ్ సాధించేసాడు. ఇంతకీ ఎవరా హీరో..? ఈ జనరేషన్‌కు బాలీవుడ్‌ అంటే షారుక్, సల్మాన్, అమీర్, అక్షయ్ మాత్రమే. కానీ వీళ్ళందరి కంటే ముందే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఒకరున్నారక్కడ.. అతడే సన్నీ డియోల్. తాజాగా గదర్ 2తో ఒక్కసారిగా జూలు విదిల్చారీ హీరో. ఈయన పంజా దెబ్బకు పఠాన్ రికార్డ్స్ కూడా కదిలేలా ఉన్నాయిప్పుడు. 500 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో సినిమాగా చరిత్ర సృష్టించింది గదర్ 2.

విడుదలైన 25వ రోజు 500 కోట్ల క్లబ్‌లో చేరింది గదర్ 2. మొదటి రోజు నుంచే ఈ చిత్ర సంచలనాలు మొదలయ్యాయి. సల్మాన్, అమీర్, అక్షయ్ సినిమాలే 100 కోట్లు దాటడానికి ముక్కీ మూలుగుతుంటే.. 20 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్‌తో ఏకంగా 500 కోట్లు దాటేసారు సన్నీ. బాహుబలి 2, పఠాన్ తర్వాత ఈ రికార్డు అందుకుంది గదర్ 2 మాత్రమే.

2001లో గదర్‌ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తే.. ఇప్పుడు సీక్వెల్ అదే చేస్తుంది. 60 ప్లస్‌లో 500 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి బాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టించారు సన్నీ డియోల్. ప్రస్తుతం పఠాన్ 543 కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. 510 కోట్లతో బాహుబలి 2 రెండో స్థానంలో ఉంది. మరోవైపు సెప్టెంబర్ 7న జవాన్ వస్తుంది.. షారుక్ ఈ సారి కూడా 500 కోట్లపై కన్నేసారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..