Sudigali Sudheer: జీవితంలో అందరికంటే రష్మీ చాలా ఎక్కువ.. సుడిగాలి సుధీర్ కామెంట్స్..
తెలుగు ప్రేక్షకులకు సుధీర్ పేరు చెప్పగానే యంకర్ రష్మీ వెంటనే గుర్తొస్తుంది. జబర్ధస్త్ వేదికపై వీరిద్దరి జోడిగా లవ్ ట్రాక్ పై బోలెడన్నీ స్కిట్స్ చేసి ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచేశారు. వీరి ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్.. ఢీషో వరకు సాగింది. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి బోలెడన్ని సార్లు పెళ్లి స్కిట్స్ చేయడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. సీక్రెట్ రిలేషన్ నడిపిస్తున్నారనే డిస్కషన్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తామిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని..

సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పేరు. జబర్ధస్త్ కామెడి షోతో పాపులర్ అయిన సుధీర్.. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులకు సుధీర్ పేరు చెప్పగానే యంకర్ రష్మీ వెంటనే గుర్తొస్తుంది. జబర్ధస్త్ వేదికపై వీరిద్దరి జోడిగా లవ్ ట్రాక్ పై బోలెడన్నీ స్కిట్స్ చేసి ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచేశారు. వీరి ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్.. ఢీషో వరకు సాగింది. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి బోలెడన్ని సార్లు పెళ్లి స్కిట్స్ చేయడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. సీక్రెట్ రిలేషన్ నడిపిస్తున్నారనే డిస్కషన్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తామిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని.. కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే అని చెప్పినా వీరిద్దరి జోడిపై మాత్రం రూమర్స్ ఆగలేదు. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు బుల్లితెరపై అలరించిన ఈ జోడి చాలా కాలంగా అడియన్స్ ముందుకు రావడం లేదు. సుధీర్ జబర్దస్త్, ఢీ షో నుంచి వెళ్లిపోవడంతో వీరిని కలిసి చూసే ఛాన్స్ దక్కలేదు. తాజాగా వీరిద్దరి కలిసి మరోసారి ప్రేక్షకులను అలరించారు.
తాజాగా ఓ ఈవెంట్లో కలిసి యాంకరింగ్ చేసిన సుధీర్ రష్మీ.. నిజమేనా చెబుతున్నా జానే జానా పాటకు డాన్స్ చేసి.. తామిద్దరి కెమిస్ట్రీ ఇంకా అలాగే ఉందని చెప్పకనే చెప్పారు. ఇక ఈ సాంగ్ డాన్స్ తర్వాత రష్మీతో తనకున్న బాండింగ్ పై సుధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకంటే ముందు స్క్రీన్ పై సుధీర్ తో తను ఉన్న పాత వీడియోలను ప్లే చేయగా.. రష్మీ భావోద్వానికి గురయ్యింది. ఈ నేపథ్యంలో రష్మీతో నాది బ్యూటీఫుల్ జర్నీ అని సుధీర్ చెప్పగానే బ్యూటీఫుల్ జర్నీనా ? లవ్ జర్నీనా ? అని గెటప్ శ్రీను పంచ్ వేశాడు.
View this post on Instagram
ఇక దీనికి రిప్లై ఇస్తూ.. బేసికల్ గా రష్మి చాలా సెన్సిటివ్.. చాలా కష్టపడేతత్వం ఉన్న వ్యక్తి.. నాకు అందరికంటే రష్మీ చాలా ఎక్కువగా అంటూ రష్మీని పొగిడేశాడు. అలాగే తన జర్నీలో , సక్సెస్ లో రష్మీదే మెయిన్ రోల్. కెరీర్ లో ముందుకెళ్లడానికి, స్కిట్స్ తో పాటు రష్మీ పాత్ర చాలా ఉందని.. ఆమెతో చేసిన ప్రోగ్రామ్స్, స్కిట్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి అంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు. రష్మీకకు థాంక్స్ చెబుతూ మిస్ యూ అని అన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



