Preetham Jukalker: సామ్ ఆ ఫోటో డెలీట్ చేయగానే నన్ను ద్వేషించారు.. చైతన్య చాలా మంచివాడు.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్..
సమంతతో ప్రీతమ్ క్లోజ్ గా దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సామ్. అయితే ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆ పిక్ డెలిట్ చేసింది. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశగా మారింది. ఇక నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ప్రీతమ్ అంటూ అతనిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు.

ప్రీతమ్ జుకల్కర్.. ఒకప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిన పేరు. సెలబ్రెటీస్ స్టైలీస్ట్.. అయినా ఏ డిజైనర్ పేరు వినిపించనంతగా ప్రీతమ్ పేరు నెట్టింట వైరల్ అయ్యింది. అందుకు అతను డిజైన్ చేసిన డ్రెస్సెస్ గురించి కాదు.. కేవలం సమంతతో క్లోజ్ గా ఫోటో దిగినందుకు మాత్రమే. అప్పట్లో ప్రీతమ్ సమంత వద్ద కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. ఆ సమయంలో సమంతతో ప్రీతమ్ క్లోజ్ గా దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సామ్. అయితే ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆ పిక్ డెలిట్ చేసింది. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశగా మారింది. ఇక నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ప్రీతమ్ అంటూ అతనిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా అతను ఎవరి వద్ద వర్క్ చేసిన ట్రోల్ చేశారు. అయితే ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రీతమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన లైఫ్, వర్క్ గురించి చెబుతూనే.. తనపై వచ్చిన ట్రోలింగ్స్ పై స్పందించారు.
ప్రీతమ్ మాట్లాడుతూ.. “సమంత నన్ను నమ్మి నా ప్రతిభను ప్రోత్సహించింది. తన ప్రోత్సాహం వల్లే ముందడుగు వేశాను. తనకు స్టైలింగ్ చేశారు. కానీ చాలా మంది మా ఇద్దరిని విమర్శించారు. ఇతడు అవసరమా ? పాత స్టైలిస్ట్ దగ్గరికే వెళ్లొచ్చుగా.. ఈ బొంబాయి వాళ్లను ఎందుకు నమ్ముతావు అని అన్నారు. ఆ మాటలు చాలా బాధేశాయి. ఎలాంటి పరిచయాలు లేకుండానే ఇండస్ట్రీకి వచ్చాను. నేనెమీ చెడ్డవాడిని కాదు.. నైపుణ్యాలు ఉన్న వ్యక్తినే. ఒక ఆర్టిస్ట్ ను. నేను హీరోయిన్లకు మాత్రమే ఎక్కువగా ఎందుకు డిజైన్ చేస్తానంటే వాళ్లు ప్రయోగాలు ఒప్పుకుంటారు. కానీ హీరోలు విభిన్న కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి ఇష్టపడరు.




ఇక గతంలో సామ్ నాతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది. అది చూసి అందరూ ఏవేవో అన్నారు. మా ఇద్దరి అన్నా చెల్లెళ్ల బంధం అనుకోవచ్చు కదా. మేమి స్నేహితులం మాత్రమే. చైసామ్ విడిపోయినప్పుడు నన్ను అన్నారు. అంతేకాకుండా నాకుటుంబాన్ని లాగారు. నన్ను అన్నప్పుడు భరించాను. కానీ నా కుటుంబాన్ని అనప్పుడు కోపం వచ్చింది. చైతన్య చాలా మంచివాడు. నేను కలిసిన మంచి వ్యక్తులలో అతడు ఒకరు. నా కెరీర్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నాను. నా స్థానంలో మరొకరు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరినీ టార్గెట్ చేయకండి” అంటూ చెప్పుకొచ్చారు ప్రీతమ్.




