Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. తీవ్రగాయంతో వీల్ చైర్‌లో ఇలా

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు సురేందర్ రెడ్డి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు మంచి ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది.

Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. తీవ్రగాయంతో వీల్ చైర్‌లో ఇలా
Surender Reddy
Follow us

|

Updated on: Jan 07, 2023 | 5:33 PM

టాలీవుడ్‌లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సురేందర్ రెడ్డి. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు సురేందర్ రెడ్డి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు మంచి ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది. తాజాగా సురేందర్ రెడ్డి షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ హీరో ఏజెంట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయనున్నారు సురేందర్ రెడ్డి. ఇక ఈ మూవీ షూటింగ్ సందర్భంగా యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్ ప్లేన్ చేస్తోన్న సమయంలో అనుకోకుండా గాయపడ్డారు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి కాలికి తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది.

వీల్ చైర్ లో సురేందర్ రెడ్డి కూర్చొని ఉండగా ఆయన కాలుకు పెద్ద కట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సురేందర్ రెడ్డి దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో సైరా సైరా నరసింహారెడ్డి‌లాంటి పిరియాడికల్ డ్రామా తెరకెక్కించి ఆకట్టుకున్నారు.

ఇక ఇప్పుడు అఖిల్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పై థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అలాగే ఈ సినిమా మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్ప్స్ సినిమా పై అంచనాలను పెంచేసింది.

ఇవి కూడా చదవండి
Surender Reddy

Surender Reddy