Pushpa: పుష్ప నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయిన పుష్పరాజ్ .. శ్రీవల్లి లుక్స్….
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా పాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక.. శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, దాక్కో దాక్కో సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా దాక్కో దాక్కో మేక పాట.. సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్.
చూపే బంగారమయనే.. శ్రీవల్లీ బంగారమయనే సాంగ్ ప్రోమోను నిన్న మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక సింగర్ సిధ్ శ్రీరామ్ ఆలపించిన చూపే బంగారమయనే .. శ్రీవల్లీ, మాటే మాణిక్యమయనే సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే అలాగే బన్నీ పూర్తిగా పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూ.. వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో రష్మిక గ్రామీణ యువతిగా కనిపిస్తున్న లుక్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. మొత్తానికి మరోసారి పుష్ప సెకండ్ సింగిల్ సాంగ్‍తో శ్రోతలను మెస్మరైజ్ చేశాడు సిధ్ శ్రీరామ్. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న విడుదల కానుంది.
Manchu Vishnu: ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలుపై తొలి సంతకం
MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు నిరాధారం.. మా ఎన్నికల అధికారి వివరణ