Prakash Raj: అందుకే నన్ను బ్యాన్ చేశారు.. స్టూడియో బయటకొచ్చి ఏడ్చాను.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన ప్రకాష్ రాజ్..
సినీ పరిశ్రమలో అతనో సంచలనం.. విలక్షణ నటనతో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు..

Prakash Raj: సినీ పరిశ్రమలో అతనో సంచలనం.. విలక్షణ నటనతో దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. హీరోగానే కాకుండా.. భయంకరమైన్ విలన్ గా.. ఓ మంచి తండ్రిగా.. అన్నగా.. స్నేహితుడిగా.. తాతగా ఇలా ఒక్కటేమిటీ ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి జనాలను అలరిస్తున్నారు ప్రకాష్ రాజ్. ఇటీవల మా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గత కొద్ది కాలంగా ప్రకాష్ రాజ్ నిత్యం ఏదో విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
అందులో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. పుట్టి పెరిగింది బెంగుళూరులోనే.. చెల్లి ఆస్ట్రేలియాలో ఉంది.. తమ్ముడి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇక నటన విషయానికి వస్తే.. కాలేజీలో జీకే గోవిందరావు అని ఓ ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవారు.. నాటకాలు వేయించేవారు..నేను బాగా నటిస్తాను అని చెప్పేవారు.. దీంతో పొగరుగా ఉండేవాడిని.. ఓ రోజు వేరే కుర్రాడితో నాటకం వేయిస్తే.. బాగా రాలేదు. దీంతో అందరూ నవ్వుకున్నారు. గురువుగారు పిలిచి.. నాటకం రాలేదని నాకు తెలుసు.. నువ్వు గొప్ప నటుడివి అవుతావన్నారు.. కానీ నేను లేకుంటే నాటక రంగమే లేదు అనే అహంకారంతో ఉండకు అని చెప్పారు.. ఆ తర్వాత పది సంవత్సరాల తర్వాత నాకు తెలుసొచ్చింది.
నాకు మొదటి అవకాశం ఇచ్చింది బాల చందర్ గారు. మొదటి సినిమా జగపతి బాబు నటించిన సంకల్పం. మహేష్ బాబుతో ఓ సినిమా చేయాల్సి ఉంది.. షూటింగ్ వాయిదా వేస్తూ వెళ్తుండడం వలన సమయానికి డేట్స్ కుదరలేదు. దీంతో వేరే నటుడిని పెట్టుకున్నారని రాశారు.. అదెలా రాస్తారని గట్టిగా అడిగాను. దీంతో నన్ను బ్యాన్ చేశారు. శ్రీను వైట్లతో ఆగడు సినిమా చేస్తున్నప్పుడు ఆయనకు కావాల్సిన వేగం రావట్లేదు. ఆయన ఏ మూడ్ లో ఉన్నారో తెలియదు..అక్కడి నుంచి వెళ్లిపోయాను. సీనియర్ నటుడిగా ఆయన్ను శీను రేపొకసారి కలిసి మాట్లాడమని అన్నాను.. మరుసటి రోజు నా స్థానంలో సోనూసూద్ వచ్చారు. ఆ తర్వాత నేను బూతులు తిట్టానని నిషేధించారు. కానీ నాకున్న ఈ ఆటిట్యూడ్ వలనే నేను ఇంత బలమైన నటుడిగా ఎదిగానని నేను అనుకుంటాను.
నాకు భాష మాట్లాడకపోతే పెర్ఫార్మెన్స్ కనిపించదు… మొదటి తెలుగు సినిమా సాయి కుమార్ తమ్ముడు రవి డబ్బింగ్ చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం స్టూడియోలో డబ్బింగ్ పనులు జరుగుతున్నప్పుడు… ఎంతసేపు అలా కాదు.. ఇలా కాదు అని చెబుతుంటే గెటౌట్ అన్నారు.. వెంటనే స్టూడియో బయటకొచ్చి ఏడ్చేశాను.. నాకు బాష నేర్చుకోవడం ఇష్టం. సాహిత్యం చదవడం ఇష్టం.. భాష నేర్చుకోవడమంటే వారి సంస్కృతిని గౌరవించినట్లు అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.
Also Read: Manchu Vishnu: ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలుపై సంతకం