Manchu Vishnu: ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలుపై తొలి సంతకం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  ('మా' )అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. కాగా మేనిఫెస్టోలోని ఓ అంశానికి సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు.

Manchu Vishnu: 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలుపై తొలి సంతకం
Manchu Vishnu

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  (‘మా’ )అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. కాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  కొత్త కమిటీ  ప్రమాణ స్వీకారం ఎప్పుడూ ఉంటుందనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద మనుషుల ద్వారా సర్ది చెప్పించి.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులను కలుపుకుపోతారా లేక.. ‘మా’ బైలాస్‌కి అనుగుణంగా కొత్తవాళ్లని వారి ప్లేసుల్లో రిప్లేస్ చేస్తారా అన్నది చూడాలి.

విష్ణు ప్యానెల్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు

 • మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్‌’ ద్వారా సభ్యుల పోర్ట్‌ఫోలియో క్రియేట్‌ చేసి, నిర్మాతలు, దర్శకులు, రచయితలకు అందిస్తాం!
 • తెలుగు కళామతల్లి ఆత్మ గౌరవం ఉట్టిపడేలా సొంత డబ్బులతో ‘మా’ భవన నిర్మాణం.
 • ‘మా’లో ఉన్న ప్రతి సభ్యుడికీ, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా. ‘మా’ సభ్యుడికి ఉచితంగా ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డులు.
 • ‘జాబ్‌ కమిటీ’ ద్వారా వారందరికీ సినిమాలు, ఓటీటీ వంటి మాధ్యమాల్లో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం!
 • అర్హులైన ‘మా’ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహం.
 • ‘మా’ మహిళా సభ్యుల సంక్షేమం, రక్షణకోసం హైపవర్‌ కమిటీ
 • గౌరవ సభ్యుత్వం ఇచ్చిన సీనియర్‌ సిటిజన్స్‌కు ఓటు హక్కు వచ్చేలా ఏజీఎంలో ఆమోదం.
 • అర్హులైన ‘మా’ సభ్యుల పిల్లలకు కేజీ టు పీజీ వరకూ విద్యా సాయం.
 • కొత్తగా ‘మా’ మెంబర్‌షిప్‌ తీసుకునేవారికి రూ.75వేలకే సభ్యత్వం
 • ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టడానికి ఒక కల్చరల్‌ అండ్‌ ఫైనాన్స్‌ కమిటీ ఏర్పాటు
 • ‘మా’ సభ్యుల పిల్లలకు సినిమాల పట్ల అభిరుచి ఉంటే వారికి ‘మోహన్‌బాబు ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’ ద్వారా 50శాతం స్కాలర్‌షిప్‌తో శిక్షణ.
 • అర్హులైన వృద్ధ కళాకారులకు ప్రతి నెలా పెన్షన్‌ అందేలా చర్యలు. అలాగే రూ.6000 పెన్షన్‌ గణనీయంగా పెంచే ఏర్పాటు
 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి అర్హులైన కళాకారులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి.
 • తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చలన చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం!

Also Read: 2 నెలల క్రితం రోడ్లపై కుప్పలు.. ఇప్పుడేమో కొందామంటే వాతలు.. తాజా ధర తెలిస్తే షాకే

సైబర్‌ మోసాల తర్పీదు కోసం స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్.. రాచకొండ పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu