Srinidhi Shetty: అందం,అభినయం ఫుల్.. అవకాశాలు మాత్రం నిల్.. కేజీఎఫ్ బ్యూటీ ఏమైందబ్బా..!!
కేజీఎఫ్ లాంటి సినిమా చేసినప్పటికీ హీరోయిన్ శ్రీనిధికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ మధ్య కన్నడ బ్యూటీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ మధ్య కాలంలో కన్నడ హీరోయిన్స్ వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఒక్క బ్యూటీ మాత్రం అవకాశలకోసం ఇంకా ఎదురుచూస్తోంది. కేజీఎఫ్ లాంటి సినిమా చేసినప్పటికీ హీరోయిన్ శ్రీనిధికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమాలో హీరోయిన్ శ్రీనిధి పాత్ర చాలా కీలకం. ఇక ఈ సినిమా తర్వాత శ్రీనిధి చియాన్ విక్రమ్ సరసన కోబ్రా అనే సినిమా చేసింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
దాంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. అయితే ఈ అమ్మడికి అవకాశాలు కరువవ్వడం పై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే కొంతమంది ఈ అమ్మడు గ్లామర్ షోకి దూరంగా ఉండటం వల్లే అవకాశాలు తక్కువయ్యాయి అని అంటున్నారు.
మరికొంతమంది రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తుందని.. అందుకే అవకాశాలు రావడం లేదు అని అంటున్నారు. నిజానికి కేజీఎఫ్ సినిమా తర్వాత శ్రీనిధి భారీగా డిమాండ్ చేస్తుందని టాక్. కోబ్రా కూడా ఈ అమ్మడు బాగానే అందుకుందట. అందుకే ఈ చిన్నదానికి ఛాన్స్ లు రావడం లేదు అని టాక్.



