Dasara Box Office Collection: దుమ్మురేపుతోన్న దసరా.. తొలిరోజే దిమ్మతిరిగే కలెక్షన్స్

శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ తో ఈ సినిమా చేశాడు. ఇక రా అండ్ రస్టిక్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో నాని ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.

Dasara Box Office Collection: దుమ్మురేపుతోన్న దసరా.. తొలిరోజే దిమ్మతిరిగే కలెక్షన్స్
Dasara
Follow us

|

Updated on: Mar 31, 2023 | 11:47 AM

నేచురల్ స్టార్ నాని దసరా మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో లవర్ బాయ్ నుంచి మాస్ హీరోగా టర్న్ అయ్యాడు. శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ తో ఈ సినిమా చేశాడు. ఇక రా అండ్ రస్టిక్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో నాని ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. తొలి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ కు ముందు భారీగా బిజినెస్ జరుపుకున్న ఈ పాన్ ఇండియా మూవీ తొలి రోజు భారీ ఓపినింగ్స్ ను సాధించింది. టీజర్, ట్రైలర్, పాటలతో సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కథను నమ్మి సినిమా చేయడంతో నాని కూడా ఈ సినిమా పక్క హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అనుకున్నట్టుగానే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక దసరా మూవీ కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయని తెలుస్తోంది. నాని కెరీర్ లో హైయెస్ట్ ఓపినింగ్స్ సాధించిన సినిమాగా దసరా నిలిచింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 38 కోట్ల గ్రాస్ సాదించిందని తెలుస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో దసరా మంచి టాక్ తెచ్చుకుంది. రానున్న రోజుల్లో కలెక్షన్స్ తో కుమ్మేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రెండు ప్లాట్ ఫామ్స్ లో జరగనుందని తెలుస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. అలాగే హిందీ వెర్షన్ హక్కులు మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.