AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో వెండితెరపైకి మరో నట వారసురాలు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో గారాలపట్టి..

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నటవారసులు హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తున్న విషయం తెల్సిందే. కేవలం వారసులు అనే కాదు టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులైన ఆదరిస్తారు.

త్వరలో వెండితెరపైకి మరో నట వారసురాలు.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో గారాలపట్టి..
Medha 2
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 29, 2021 | 8:11 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నటవారసులు హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తున్న విషయం తెల్సిందే. కేవలం వారసులు అనే కాదు టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులైన ఆదరిస్తారు. వారసులుగా వచ్చి తమ టాలెంట్‌తో, నటనతో రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో కూతురు ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు..  శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా మంది హీరోల కుమార్తెలు హీరోయిన్స్‌గా పరిచయమైన విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మి ప్రసన్న, సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు మంజుల, మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక, సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తెలు శివాని-శివాత్మిక ఇలా చాలా మంది ఉన్నారు. రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు శ్రీకాంత్ కుమార్తె మేధా కూడా హీరోయిన్‌గా రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే శ్రీకాంత్ వారసుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అతడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సంద-డి అనే చిత్రం చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు 17 ఏళ్ల మేధ త్వరలోనే హీరోయిన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై మెరువబోతుందనే వార్త టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె భరత నాట్యంలో శిక్షణ తీసుకుంటుందట. ఇక కూతురు ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా మంచి కథలను సెలక్ట్‌ చేసే పనిలో ఉన్నారట శ్రీకాంత్‌, ఊహ. ఇప్పటికే కొన్ని కథలను కూడా విన్నారట.

Medha

ఇక వంద సినిమాలపై నటించి.. ఇప్పటికీ నటిస్తూ అలరిస్తున్నారు శ్రీకాంత్. మొదట్లో ఫ్యామిలీ హీరోగా కనిపించి ఆకట్టుకున్న శ్రీకాంత్.. ఆతర్వాత మాస్ హీరోగాను అలరించారు. వందకు పైగా సినిమాలో అనేక విజయవంతమైన సినిమాలో నటించి మెప్పించారు. ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమా కోసం విలన్ అవతారమెత్తారు శ్రీకాంత్ .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna Akkineni: కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ.. మీరు ఒక లుక్ వేయండి..

Maestro: మాస్ట్రో అఫీషియల్ డేట్ వచ్చేసింది.. హాట్‌స్టార్‌ ప్రకటించింది.. ఎప్పుడో తెలుసా.!

PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్‌ చేసిన చిరంజీవి