AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SPIDER-MAN: మన సినిమాలకే కాదు హాలీవుడ్ సినిమాలకు తప్పని లీకుల బెడద.. ముందే బయటకు వచ్చిన ట్రైలర్

లీకుల బెడద అన్ని ఫిలిమ్ ఇండస్ట్రీలను వేధిస్తుంది. ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలకు సంబంధించిన ఫోటోలు, టీజర్లు, ట్రైలర్లు, పాటలు..

SPIDER-MAN: మన సినిమాలకే కాదు హాలీవుడ్ సినిమాలకు తప్పని లీకుల బెడద.. ముందే బయటకు వచ్చిన ట్రైలర్
Spider Man
Rajeev Rayala
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 26, 2021 | 9:45 AM

Share

Spider-Man No Way Home : లీకుల బెడద అన్ని ఫిలిమ్ ఇండస్ట్రీలను వేధిస్తుంది. ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలకు సంబంధించిన ఫోటోలు, టీజర్లు, ట్రైలర్లు, పాటలు ఇలా ఎదో ఒకటి విడుదలకంటే ముందే నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారువారి పాట సినిమా టీజర్‌ను మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఉదయం 9గంటల సమయంలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అంతకన్నా ముందే టీజర్ లీక్ అవ్వడంతో హుటాహుటిన అర్ధరాత్రి టీజర్‌ను విడుదల చేశారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమానుంచి కూడా టైటిల్ సాంగ్ కూడా విడుదలకు ఒక్క రోజు ముందే లీక్ అయ్యింది. ఇదిలా ఉంటే మన సినిమాలకే కాదు హాలీవుడ్ జనాలకు కూడా లీకుల బెడద తప్పటం లేదు. రీసెంట్‌గా స్పైడర్‌ మ్యాన్‌ నో వే హోమ్ సినిమా ట్రైలర్‌ అఫీషియల్‌ రిలీజ్‌ కన్నా ముందే లీక్ అయ్యింది. దీంతో మూవీ టీమ్‌ అనుకున్న టైమ్‌ కన్నా ముందే అఫీషియల్ రిలీజ్ చేసేసింది.

అయితే ఒక్క ట్రైలర్‌తోనే స్పైడర్ మ్యాన్‌ లవర్స్‌ను ఫ్లాష్‌ బ్యాక్‌లోకి తీసుకెళ్లారు మేకర్స్‌. స్పైడర్ మ్యాన్‌ సిరీస్ స్టార్టింగ్‌లో ఆక్టోపస్‌లా కనిపించిన విలన్ డాక్టర్ ఓక్‌ గుర్తున్నాడా..? ఆ విలన్‌ ఇప్పుడు కొత్త సినిమాలో మరోసారి మన సూపర్ హీరోతో తలపడబోతున్నారు. లేటెస్ట్ ట్రైలర్‌లో డాక్టర్ ఓక్‌.. హాలో పీటర్ అంటూ ఎంట్రీ ఇవ్వటంతో ఫ్యాన్స్ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఓక్ ఒక్కడే కాదు… గ్రీన్ గొబ్లిన్‌, ఎలక్ట్రో కూడా లేటెస్ట్ మూవీతో స్పైడర్‌ మ్యాన్‌ను ఇబ్బంది పెట్టేందుకు రెడీ అవుతున్నారు. అంటే.. పాత విలన్స్‌తో కొత్త యాక్షన్‌ అనమాట. మరి ఈ పోరులో స్పైడర్‌ మ్యాన్‌ ఎలా సక్సెస్‌ అయ్యారు అన్నది బిగ్‌ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

Aishwarya Rai: అచ్చం శివగామిలాగే ఐశ్వర్యా రాయ్.. నెట్టింట్లో హల్‏చల్ చేస్తోన్న ఐష్ న్యూలుక్.. చూస్తే ఫిదా కావాల్సిందే..

వయ్యారంగా ఫోటోకు ఫోజులిచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. మీ కోసం చిన్న క్లూ.. ఇప్పటికీ కుర్రాళ్ల కళల రాకుమారి..

Ram Gopal Varma: కాలేజీ రోజుల్లోనే రామ్ గోపాల్ వర్మ ప్రేమాయణం.. తన ఫస్ట్ లవర్ ఫోటో షేర్ చేసిన ఆర్జీవి..