AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soundarya Birthday: చివరి చూపు చూసేందుకు తల లేదు.. బాక్స్‏లో సౌందర్య డెడ్ బాడీ.. హీరోయిన్ ఎమోషనల్..

ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ అందమైన రూపం ఇప్పుడు లేదు.. కానీ ఇప్పటికీ ఆమె పేరు వినిపిస్తే అభిమానులు, సినీ ప్రముఖులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈరోజు ఆ అందాల జాబిలి సౌందర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు సినీ తారలు.

Soundarya Birthday: చివరి చూపు చూసేందుకు తల లేదు.. బాక్స్‏లో సౌందర్య డెడ్ బాడీ.. హీరోయిన్ ఎమోషనల్..
Soundarya
Rajitha Chanti
|

Updated on: Jul 18, 2024 | 7:50 PM

Share

దక్షిణాది సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య. అందం, అభినయం, గౌరవం, విధేయత.. ఇలా ఎన్నో లక్షణాలు ఉన్న అందాల తార. అలనాటి హీరోయిన్ సావిత్రి తర్వాత అంతటి గొప్ప గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. నటిగా గ్లామర్ ప్రపంచాన్ని ఏలాలంటే ఎక్స్ ప్రోజింగ్ మాత్రమే కాదు.. సంప్రదాయ చీరకట్టులో.. సహజమైన నటనతో అగ్రకథానాయికగా కొనసాగింది. అభినయంతోనే వరుస ఆఫర్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. చేతినిండా సినిమాలు.. అతి తక్కువ సమయంలోనే.. చిన్న వయసులో స్టార్ డమ్. అయినా ఏమాత్రం పొగరు, అహంకారం లేకుండా సాధారణ అమ్మాయిలగా ఎంతో ఆప్యాయంగా పలకరించేందంటూ ఇప్పటికే చాలా మంది నటీనటులు, దర్శకనిర్మాతలు తెలిపారు. ఎంతో మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ అందమైన రూపం ఇప్పుడు లేదు.. కానీ ఇప్పటికీ ఆమె పేరు వినిపిస్తే అభిమానులు, సినీ ప్రముఖులు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈరోజు ఆ అందాల జాబిలి సౌందర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు సినీ తారలు.

మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన సౌందర్య.. అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ అందుకున్నారు. అప్పట్లోనే స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగారు. అందం, అభినయంతోనే కాదు.. ఆమె వ్యక్తిత్వానికి కూడా ముగ్దులయ్యారు. సినీ రంగుల ప్రపంచంలో అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న సమయంలోనే 2004లో ఓ రాజకీయ పార్టీ ప్రచారం కోసం హెలీకాఫ్టర్ లో బయలుదేరిన సౌందర్య.. ఆ కొద్ది సమయంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్యతోపాటు ఆమె సొదరుడు అమర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. సౌందర్య మరణంతో ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలింది. అప్పటివరకు వెండితెరపై అలరించిన అందమైన రూపం ఇకలేదని తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పట్లో సౌందర్య పార్దీవ దేహాన్ని చూడడానికి అభిమానులు, దక్షిణాది సినీతారలు తరలివచ్చారు. అయితే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య తల, మొండెం వేరు అయ్యాయని.. అసలు గుర్తుపట్టలేనంతగా ఆమె శరీరం కాలిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది నిజమో కాదో తెలియదు.. కానీ సౌందర్య పార్ధివదేహాన్ని చూసిన సీనియర్ హీరోయిన్ ప్రేమ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో సీనియర్ హీరోయిన్ ప్రేమ మాట్లాడుతూ.. సౌందర్య చనిపోయిన రోజున .. ఆమెను చూడడానికి వాళ్ల ఇంటికి వెళ్లానని.. ఇంటి ఎదురుగా సౌందర్య, ఆమె సోదరుడు అమర్ ఇద్దరి ఫోటోస్ పెట్టి ఉన్నాయని అన్నారు. సౌందర్య పార్థీవ దేహాన్ని ఒక బాక్స్ లో పెట్టారని.. చివరి చూపు చూడటానికి తన తల లేదని..కేవలం బాడీ మాత్రమే ఉందని.. ఆ స్థితిలో సౌందర్యను చూసి తట్టుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యారు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం.. పోయేటప్పుడు తీసుకెళ్లేది కేవలం కర్మను మాత్రమే. సౌందర్యను గుర్తుపట్టేందుకు తల లేదు.. ఆమె చేతికి ఉన్న వాచ్ చూసి గుర్తుపట్టామని.. ఆ సమయంలో ఆమె అమ్మగారితో మాట్లాడే ధైర్యం లేదని.. బయటకు వచ్చేటప్పుడు సౌందర్య ఫోటో చూసి వచ్చానని ఆరోజును గుర్తుచేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.