Yatra 2 Movie: ‘యాత్ర 2’లో సోనియా గాంధీ పాత్రకు జర్మనీ నటి.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా ?..

డైరెక్టర్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. ఇందులో ఇందులో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి సోనియా పాత్ర‌ను మంగళవారం విడుదల చేశారు మేకర్స్. యాత్ర 2 చిత్రంలో సోనియా గాంధీ పాత్రలో

Yatra 2 Movie: 'యాత్ర 2'లో సోనియా గాంధీ పాత్రకు జర్మనీ నటి.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా ?..
Yatra 2 Movie
Follow us

|

Updated on: Nov 07, 2023 | 12:29 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన యాత్ర చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్ రాబోతుంది. డైరెక్టర్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. ఇందులో ఇందులో వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి సోనియా పాత్ర‌ను మంగళవారం విడుదల చేశారు మేకర్స్. యాత్ర 2 చిత్రంలో సోనియా గాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ నటిస్తున్నారు. ఆమె అచ్చం సోనియా గాంధీలాగే కనిపిస్తున్నారు.

ఎవరీ సుజానే బెర్నెర్ట్..

సోనియా గాంధీ పాత్రకు అచ్చుగుద్దినట్లుగా సరిపోయిన ఆ నటి పేరు సుజానే బెర్నెర్ట్. ఆమె జ‌ర్మ‌నీలో పుట్టి పెరిగారు. ఇప్పటికే ఆమె క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌, హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ జీవితాల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర సోనియాగా ఎలా మెప్పించ‌బోతున్నార‌నేది ఆస‌క్తికంగా మారింది. యాత్ర 2కి సోనియాకి ఉన్న సంబంధం ఏంట‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

ఇదిలా ఉంటే.. గతంలో వచ్చిన యాత్ర చిత్రాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు కొన‌సాగింపుగా, వైఎస్‌ఆర్ త‌న‌యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌ చేయనున్నారు. ప్రస్తుతం శ‌ర‌వేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్. సంతోష్ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెంట్ అగ్రిమెంట్‌కు పోలీసు వెరిఫికేషన్ చేయించారా? లేకపోతే ఇబ్బందే
రెంట్ అగ్రిమెంట్‌కు పోలీసు వెరిఫికేషన్ చేయించారా? లేకపోతే ఇబ్బందే
నీచ కుజుడితో మాంగల్య దోషం..! ఈ విషయాల్లో వారు జాగ్రత్త
నీచ కుజుడితో మాంగల్య దోషం..! ఈ విషయాల్లో వారు జాగ్రత్త
వరుడు సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది..
వరుడు సినిమా హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది..
ఓరి నాయనో.. ఏపీకి మరో అల్పపీడనం ముప్పు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఓరి నాయనో.. ఏపీకి మరో అల్పపీడనం ముప్పు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
పటాకులు కాలుస్తుంటే గాయపడితే.. ప్రధమ చికిత్స ఎలా చేయాలంటే
పటాకులు కాలుస్తుంటే గాయపడితే.. ప్రధమ చికిత్స ఎలా చేయాలంటే
ట్రాఫిక్ విభాగంతో హైడ్రా దోస్తీ..ఇక ట్రాఫిక్ జామ్‌కు స్వస్తి
ట్రాఫిక్ విభాగంతో హైడ్రా దోస్తీ..ఇక ట్రాఫిక్ జామ్‌కు స్వస్తి
పామాయిల్ మంచిది కాదని వాడటం లేదా.. పప్పులో కాలేసినట్లే!
పామాయిల్ మంచిది కాదని వాడటం లేదా.. పప్పులో కాలేసినట్లే!
ఒంటరిగా కేతువు.. ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు..!
ఒంటరిగా కేతువు.. ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు..!
రోజుకి లక్ష రెమ్యునరేషన్.. డబ్బు కట్టలపైనే నిద్ర.. కానీ చివరకు
రోజుకి లక్ష రెమ్యునరేషన్.. డబ్బు కట్టలపైనే నిద్ర.. కానీ చివరకు
ఈ లేడీ ప్రొడ్యూసర్ శోభన్ బాబు బంధువా..!
ఈ లేడీ ప్రొడ్యూసర్ శోభన్ బాబు బంధువా..!