Mahesh Babu: చిన్నోడు ధరించిన ‘హీర్మేస్’ స్వెట్‌షర్ట్ చాలా ఖరీదు.. ధర తెలిస్తే ఆశ్చర్యమే..
ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈరోజు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ధమ్ మసాలా సాంగ్ రిలీజ్ కాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తాజాగా వినిపిస్తో్న్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో మహేష్ బాబు ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గురించి ఇంక చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్ గా మహేష్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈరోజు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ధమ్ మసాలా సాంగ్ రిలీజ్ కాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తాజాగా వినిపిస్తో్న్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే మహేష్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ విక్టరీ వెంకటేష్‌తో కలిసి సరదాగా గడిపారు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇక వెంకీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు మహేష్.
పెద్దోడు పక్కన ఉంటే ఎంతో సరదాగా ఉంటుందంటూ వెంకటేశ్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు మహేష్. ఈ ఫోటో క్షణాల్లోనే వైరలయ్యింది. అయితే అందులో మహేష్ ఆరెంజ్ కలర్ స్వెట్ షర్ట్ లో మరింత స్టైలీష్ గా కనిపించాడు. ఇప్పుడు ఆ షర్ట్ ధర గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. మహేష్ ధరించిన బాబు ధరించిన ‘హీర్మేస్’ స్వెట్‌షర్ట్ ధర రూ. 1,21,330 ఉంటుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. గుంటూరు కారం చిత్రంలో మహేష్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఇందులో మహేష్ జోడిగా మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




